Gatha Vaibhava: ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ఎపిక్ ఫాంటసీ డ్రామా “గత వైభవ” టీజర్ రిలీజ్

ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఎపిక్ ఫాంటసీ డ్రామా గత వైభవ (Gatha Vaibhava). సింపుల్ సుని దర్శకత్వంలో సర్వెగర సిల్వర్ స్క్రీన్స్, సుని సినిమాస్ బ్యానర్స్ పై దీపక్ తిమ్మప్ప, సుని నిర్మిస్తున్నారు.
మేకర్స్ తాజాగా ఈ సినిమా టీజర్ ని రిలీజ్ చేశారు. చరిత్ర, పురాణాల నేపధ్యంలో రూపొందిన టీజర్ అద్భుతంగా వుంది. ఎస్ఎస్ దుశ్యంత్, అశికా రంగనాథ్ పెర్ఫార్మెన్స్ లు ఆకట్టుకున్నాయి.
డైరెక్టర్ సింపుల్ సుని కథని విజువల్ వండర్ గా ప్రజెంట్ చేశారు. గ్రాండ్ విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ టీజర్ పై మంచి బజ్ క్రియేట్ చేశాయి. టీజర్ సినిమాపై చాలా క్యురియాసిటీ పెంచింది.
నవంబర్ 14న ఈ చిత్రం విడుదల కానుంది.