మెగా ప్రిన్స్ కష్టమంతా వృధానే
ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ టైమ్ అస్సలు బాగోలేదు. ఎంత కష్టపడుతున్నా తన కష్టానికి తగ్గ ఫలితం మాత్రం వరుణ్ కు దక్కడం లేదు. తను చేసిన ప్రతీ సినిమాతో తనకు డిజాస్టరే వస్తుంది. లాస్ట్ ఇయర్ గని సినిమా చేసిన వరుణ్ కు ఆ సినిమా దారుణమైన ఫెయిల్యూర్ని అందించింది. ఆ సినిమా కోసం తన ఒళ్లు కూడా బాగా హూనం చేసుకున్నాడు వరుణ్.
ఇప్పుడు మరోసారి గాండీవధారి అర్జున కోసం కూడా వరుణ్ చాలా కష్టపడ్డాడు. గనికి కనీసం మంచి ఓపెనింగ్స్ అయినా వచ్చాయి కానీ ఈ సినిమాకు అది కూడా లేదు. ఈ సినిమాకు మార్నింగ్ షో లు కూడా పుల్ అవలేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. కనీసం మెగా ఫ్యాన్స్ వరకు వచ్చినా మార్నింగ్ షోలకు హౌస్ఫుల్ బోర్డ్స్ పడేవి.
దానికి తోడు పబ్లిక్ టాక్, రివ్యూలు కూడా ఏ మాత్రం పాజిటివ్ గా లేకపోవడంతో గాండీవధారి అర్జున ఫలితం దారుణంగా మారింది. కొత్తగా ఉండే స్టోరీలు చేయడం మంచిదే కానీ ఆ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఏ మేరకు సక్సెస్ అవుతాయి? ఇలాంటి సబ్జెక్ట్ ను డైరెక్టర్ ఏ విధంగా హ్యాండిల్ చేయగలడు అనేవి కూడా దృష్టిలో పెట్టుకుంటే బాగుంటుంది. ఈ సినిమా ఫ్లాప్ తో వరుణ్ తన ఆశలన్నీ తర్వాతి సినిమా వాలెంటైన్ మీదే పెట్టుకున్నాడు.













