గేమ్ ఛేంజర్ వచ్చేస్తున్నాడు!
ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్(Mega Powerstar Ram Charan) తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్(Director Shankar) తో సినిమా చేస్తున్నాడనగానే మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధుల్లేవు. టాలీవుడ్ లోని ఎందరో స్టార్ హీరోలు శంకర్ తో సినిమా చేయాలనుకున్నప్పటికీ వారెవరికీ దక్కని ఛాన్స్ చరణ్ కు దక్కిందని ఫ్యాన్స్ చాలా ఎగ్జైట్ అయ్యారు. కానీ తర్వాత్తర్వాత జరిగిన పరిణామాల వల్ల గేమ్ ఛేంజర్(Game Changer) పై ఫ్యాన్స్ కు ఇంట్రెస్ట్ తగ్గుతూ వచ్చింది.
సినిమా షూటింగ్ లేటవడం, ఎన్నో సార్లు షెడ్యూల్స్ కు బ్రేక్స్ పడటం, మేకర్స్ నుంచి సరైన అప్డేట్స్ ఇవ్వకపోవడం, రిలీజ్ గురించి ఇప్పటికీ సరైన క్లారిటీ లేకపోవడం ఫ్యాన్స్ ను బాగా ఇబ్బంది పెట్టాయి. గేమ్ ఛేంజర్ క్రిస్మస్ కు వస్తుందని దిల్ రాజు(Dil Raju) చెప్పి కొన్ని వారాలైంది కానీ ఇప్పటివరకు డేట్ ను అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయలేదు.
అయితే తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను సెకండ్ సింగిల్(Game Changer 2nd Single) తో పాటూ అనౌన్స్ చేయనున్నట్లు తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లే డిసెంబర్ 20న గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించనున్నారట. ఒకట్రెండు రోజుల్లో పోస్టర్ ను లాంచ్ చేయనున్నారట. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ ను బట్టి మిగిలిన సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారనున్నాయి. కియారా అద్వానీ(Kiara Adwani) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.













