గేమ్ ఛేంజర్ ఇకనైనా ఫిక్స్ అవాల్సిందే
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న గేమ్ ఛేంజర్ రిలీజ్ ఎప్పుడెప్పుడవుతుందా అని మెగా ఫ్యాన్స్ తో పాటూ సగటు సినీ ప్రియులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను ఎట్టి పరిస్థితుల్లో ఈ ఏడాదే రిలీజ్ చేయాలని నిర్మాత దిల్ రాజు చాలా పట్టుదలతో ఉన్నారు. దానికి రీజన్స్ లేకపోలేదు. ఆయన బ్యానర్ లో వస్తున్న వెంకీ సినిమా, చిరూ నటిస్తున్న విశ్వంభర సంక్రాంతికి రిలీజ్ అవుతున్నాయి.
అందుకే ఎలాగైనా సరే త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను వేగవంతం చేయాలని చూస్తున్నారు. గేమ్ ఛేంజర్ రిలీజ్ కోసం రెండు ఆప్షన్స్ అనుకుంటున్నారు. వాటిలో ఒకటి దీపావళి. చెప్పుకోవడానికి మంచి టైమే అయినా అదే టైమ్ లో కోలీవుడ్ నుంచి భారీ పాన్ ఇండియా సినిమాలు రిలీజ్ కావడానికి రెడీగా ఉన్నాయి.
సూర్య నటిస్తున్న కంగువ ఇప్పటికే బాగా లేటైంది. ఈ పీరియాడిక్ మూవీ మీద ఎన్నో అంచనాలున్నాయి. అజిత్ నటిస్తున్న విదముయార్చి కూడా అదే టైమ్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. వీటితో పాటూ కమల్-మణిరత్నం కాంబోలో వస్తున్న థగ్ లైఫ్ కూడా దీపావళిని టార్గెట్ చేస్తున్నట్లు తెలుస్తోంది. వీటిలో ఏది నిజమైనా పక్క రాష్ట్రాల్లో గేమ్ ఛేంజర్ కు పోటీ తప్పదు. ఒకవేళ దీపావళి మిస్ అయితే డిసెంబర్ కు వెళ్దామంటే ఇప్పటికే ఆ నెలను పుష్ప2, తండేల్, రాబిన్ హుడ్ ఉన్నాయి. కాబట్టి గేమ్ ఛేంజర్ వీలైనంత త్వరగా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంటే బెటర్. లేదంటే పోటీ పరంగా ఇబ్బందులు తప్పవు.













