గేమ్ ఛేంజర్.. గేరు మార్చాల్సిందే
రామ్ చరణ్(Ram charan ) హీరోగా శంకర్(sankar) దర్శకత్వంలో వస్తోన్న గేమ్ ఛేంజర్(game changer) సినిమా ఎప్పుడో మూడేళ్ల కిందట మొదలవడం వల్ల దాని బడ్జెట్ విపరీతంగా పెరిగిపోయింది. కానీ సినిమా బజ్ మాత్రం ఇంకా పెరగలేదు. ఇండియన్2(Indian2) ఎఫెక్ట్, జరగండి(jaragandi) సాంగ్ పై వచ్చిన నెగిటివిటీ గేమ్ ఛేంజర్ కు బాగానే డామేజ్ చేశాయి. వాటన్నింటిని సరి చేయడానికి దిల్ రాజు(Dil Raju) టీమ్ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.
దీపావళికి రానున్న టీజర్(Game Changer Teaser) తో ఆడియన్స్ ను టార్గెట్ చేశారు. ప్రస్తుతం ఆ టీజర్ కు సంబంధించిన ఎడిటింగ్ వర్క్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. సినిమాకు మంచి బిజినెస్ జరగాలంటే ఈ టీజర్ తోనే మంచి హైప్ క్రియేట్ చేయగలగాలి. తెలుగు రాష్ట్రాల నుంచే గేమ్ ఛేంజర్ కు రూ.150 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ ను ఆశిస్తున్నాడు నిర్మాత దిల్ రాజు.
అంత మొత్తంలో రికవరీ జరగాలంటే వీలైనంత తక్కువ పోటీ ఉండాలి. కానీ సంక్రాంతి రేసులో ఇప్పటికే అజిత్(Ajith), వెంకటేష్(venkatesh), సందీప్ కిషన్(Sundeep Kishan) ఉన్నారు. ఆ టైమ్ కు ఇంకెంత మంది ఈ రేసులో జాయిన్ అవుతారో తెలియదు. రామ్ చరణ్ ఇమేజ్ ఓవర్సీస్ లో ఉపయోగపడుతుంది కానీ సినిమా మాస్ ఆడియన్స్ కు రీచ్ అవాలంటే ప్రమోషన్స్ లో మాస్ కంటెంట్ ను చూపించాల్సిందే. దానికి సరైన కంటెంట్ ను టీజర్ లోనే చూపించాలి. అంతేకాదు టీజర్ రిలీజ్ తర్వాత కూడా ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. రిలీజ్ కు మరో 75 రోజులు మాత్రమే ఉండటంతో గేమ్ ఛేంజర్ గేర్ మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉందని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.













