గేమ్ ఛేంజర్ షూటింగ్ అప్డేట్
ఆర్ఆర్ఆర్ తర్వాత రామ్ చరణ్ హీరోగా చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. లెజెండరీ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రమోషన్స్ కూడా మొదలయ్యాయి. రీసెంట్ గానే సినిమా నుంచి ఫస్ట్ లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ఇదంతా బాగానే ఉంది ఇంతకీ ఈ సినిమా షూటింగ్ ఎంత వరకు పూర్తయిందనే విషయం ఇప్పుడు అందరికీ ఆసక్తి కరంగా మారింది.
తాజా సమాచారం ప్రకారం, గేమ్ ఛేంజర్ షూటింగ్ ఇప్పటికే 85% పూర్తయిందని, మరో 15% మాత్రమే బ్యాలెన్స్ ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన చివరి షెడ్యూల్ జరుగుతుందని, దీంతో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని తెలుస్తోంది. ఏప్రిల్ నెలాఖరుకి గేమ్ ఛేంజర్ షూటింగ్ ను పూర్తి చేయనున్నారని సమాచారం.
ఆ తర్వాత పోస్ట్ ప్రొడకన్షన్ వర్క్స్ మొదలు కానున్నాయి. దానికి కూడా ఎక్కువ టైమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ ను అక్టోబర్ లో రిలీజ్ అంటున్నారు. అంటే పోస్ట్ ప్రొడక్షన్‌కే దాదాపు ఆరు నెలల పాటూ టైమ్ పట్టనుంది. శంకర్ సినిమాలంటే ఆ మాత్రం టెక్నికల్ వర్క్ ఉంటుంది కాబట్టి ఆరు నెలలేమీ పెద్ద ఎక్కువ టైమ్ కాదు. ఈ సినిమా తర్వాత జూన్ నుంచి రామ్ చరణ్, బుచ్చిబాబు దర్శకత్వంలో చేయబోయే సినిమాలో పాల్గొననున్నాడు. ఇప్పటికే ఆ సినిమా కోసం హైదరాబాద్ పరిసరాల్లో భారీ సెట్స్ కూడా వేస్తున్నారు.













