Game Changer: చరణ్ తో అంత తక్కువ టైమా శంకర్?
రామ్ చరణ్(ram charan) హీరోగా శంకర్(shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్(Game Changer) రిలీజ్ కు పట్టుమని పాతిక రోజులు కూడా లేవు. పుష్ప2(pushpa2) రిలీజ్ తర్వాత టాలీవుడ్ నుంచి వస్తున్న అతి పెద్ద పాన్ ఇండియా సినిమా ఇదే. డిసెంబర్ 21న యూఎస్ లో జరగనున్న ప్రీ రిలీజ్ ఈవెంట్ తో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ ను వేగవంతం చేయబోతుంది.
ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం గేమ్ ఛేంజర్ రన్ టైమ్(Game changer Run time) 2 గంటల 42 నిమిషాలకు లాక్ చేసినట్లు తెలుస్తోంది. వాస్తవానికి శంకర్ సినిమాల రన్ టైమ్ ఎప్పుడూ మూడు గంటలు లేదా అంతకు మించి ఉంటాయి. అలాంటిది రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో ఇంత తక్కువ నిడివిని ప్లాన్ చేయడమంటే చాలా స్పెషలనే చెప్పాలి.
సెన్సార్ వెర్షన్ ఇంకా రెడీ కాలేదు కాబట్టి ఇదే ఫైనల్ అని చెప్పలేం కానీ శంకర్ ఆలోచన మాత్రం అదేనని తెలుస్తోంది. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాబోతున్న నేపథ్యంలో బుకింగ్ యాప్స్, వెబ్ సైట్స్ లో కూడా పైన చెప్పిన రన్ టైమ్ నే చెప్తున్నారు. ఈ నెలాఖరు కంటే ముందే గేమ్ ఛేంజర్ ఫస్ట్ కాపీని రెడీ చేయాలని శంకర్ చూస్తున్నాడు. తమన్(thaman) ఇంకా రీరికార్డింగ్ మొదలుపెట్టలేదు. కియారా అద్వానీ(Kiara advani) హీరోయిన్ గా నటిస్తున్న గేమ్ ఛేంజర్ సినిమా ప్రపంచ వ్యాప్తంగా జనవరి 10న 12 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ కానుంది.













