Game Changer: గేమ ఛేంజర్ కు ఊరటనిచ్చిన కోలీవుడ్
ఇప్పటివరకు సంక్రాంతికి ఫిక్స్ అయిన సినిమాలు నాలుగు. గేమ్ ఛేంజర్(Game Changer), విడాముయార్చి(Vidamuyarchi), డాకు మహారాజ్(Daku Maharaj), సంక్రాంతికి వస్తున్నాం(Sankranthiki Vasthunnam). ముందు అజిత్(Ajith) సినిమా రేసులో లేదు కానీ సడెన్ గా బరిలో నిలవడంతో తమిళనాడులో చరణ్(Charan) కు థియేటర్ల పరంగా వచ్చే చిక్కులను కొట్టిపారేయలేం. పైగా కొంత గ్యాప్ తర్వాత అజిత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో తమిళనాడులో మంచి బజ్ ఉంది.
దీంతో చరణ్ కు తమిళనాడులో టఫ్ ఫైట్ ఉంటుందని అర్థమైపోయింది. ఇదిలా ఉంటే వాస్తవానికి విక్రమ్(Vikram) వీర ధీర శూరన్2(Veera Dheera Sooran2) ను కూడా సంక్రాంతికే రిలీజ్ చేయాలని మేకర్స్ ట్రై చేశారు కానీ పోస్ట్ ప్రొడక్షన్ పెండింగ్ లో ఉండటం వల్ల పోస్ట్ పోన్ తప్పదని తెలుస్తోంది. విక్రమ్ సినిమా వాయిదా పడటంతో ఆ సినిమా కోసం లాక్ చేసుకున్న థియేటర్లు చరణ్, అజిత్ షేర్ చేసుకోనున్నారు.
అంతే కాదు బాలా(Bala) డైరెక్షన్ లో తెరకెక్కిన వనంగాన్(Vanangan) కూడా పొంగల్ కు రావడం లేదు. ఈ సినిమా టీజర్ వచ్చి కూడా చాలా నెలలైంది. సంక్రాంతికి రావడం డౌటేనని బయ్యర్లకు ఇప్పటికే ఇన్ఫర్మేషన్ వెళ్లిందట. అజిత్ తో పోటీ ఎందుకనుకున్నారో లేక గేమ్ ఛేంజర్ ఉందని లైట్ తీసుకున్నారో కానీ రీజన్ ఏదైనా ఇది మాత్రం గేమ్ ఛేంజర్ కు మంచి ఊరటనిచ్చే అంశమే.













