అనుమానాలను తెర దించిన దిల్ రాజు
గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న వార్తలకు దిల్ రాజు(Dil raju) ఇవాళ వీడియో బైట్ ద్వారా చెక్ పెట్టేశాడు. ముందు నుంచి చెప్తున్నట్లు రామ్ చరణ్(Ram Charan) గేమ్ ఛేంజర్(Game Changer) క్రిస్మస్ కు కాకుండా సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. మూడేళ్ల నుంచి నిర్మాణంలోనే ఉన్న సినిమా కావడం, దానికి తోడు ఆర్ఆర్ఆర్(RRR) తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.
ఈ నేపథ్యంలో ఇలాంటి పాన్ ఇండియా సినిమా జనవరిలో రావడమే మంచిదని భావించి విశ్వంభర(Viswambhara) నిర్మాతలతో పాటూ చిరంజీవి(Chiranjeevi)ని కూడా సంప్రదించాకే ఈ నిర్ణయం తీసుకున్నామని, దీనికి సహకరించిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలియచేశాడు నిర్మాత దిల్ రాజు. దీంతో సంక్రాంతికి వచ్చే సినిమాల లిస్ట్ మారిపోయింది.
దిల్ రాజు బ్యానర్ నుంచి గేమ్ ఛేంజర్ తో పాటూ అనిల్ రావిపూడి(Anil Ravipudi)- వెంకటేష్(Venkatesh) సినిమా కూడా సంక్రాంతికే రానుంది. బాలయ్య109(NBK109), అజిత్(Ajith) గుడ్ బ్యాడ్ అగ్లీ(Good Bad Ugly), సందీప్ కిషన్(Sundeep Kishan) మజాకా(Majaka) సినిమాలు సంక్రాంతి పోటీలో ఉన్నాయి. మరి రిలీజ్ దగ్గర పడేనాటికి ఏ సినిమా రేసులో ఉంటాయో చూడాలి. డిసెంబర్ మూడో వారంలో హాలీవుడ్ సినిమాలు రిలీజవుతుండటం వల్ల ఓవర్సీస్ లో ఎదురయ్యే థియేటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని గేమ్ ఛేంజర్ ను సంక్రాంతికి వాయిదా వేయడంలో దిల్ రాజు మాస్టర్ మైండ్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తుండగా కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటిస్తోంది. ఈ నెలాఖరుకి గేమ్ ఛేంజర్ నుంచి ఓ మెలోడీ సాంగ్ రిలీజ్ కానుంది.













