గేమ్ ఛేంజర్ కు రీషూట్లు?
ఆర్ఆర్ఆర్ తో గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న రామ్ చరణ్ ఆ సినిమా తర్వాత వెంటనే శంకర్ తో సినిమాను అనౌన్స్ చేయడంతో ఫ్యాన్స్ ఎంతో సంతోషించారు. దానిక్కారణం శంకర్ లాంటి డైరెక్టర్ తో వర్క్ చేయాలని చిరంజీవితో సహా పలు టాప్ స్టార్లు ఆశపడ్డారు. వారెవరికీ కుదరనిది ఇప్పుడు చరణ్ చేస్తుండటమే ఆ సంతోషానికి కారణం.
అయితే ఈ సినిమా వాయిదాల మీద వాయిదాలు పడి ఏకంగా నాలుగేళ్లయినా గేమ్ ఛేంజర్ రిలీజ్ కు నోచుకోకపోవడం ఇప్పుడు ఫ్యాన్స్ ను నిరాశకు గురిచేస్తుంది. అయితే మొన్నామధ్య నిర్మాత దిల్ రాజు క్రిస్మస్ కు ఈ సినిమాను రిలీజ్ చేస్తున్నామని చెప్పిన దగ్గరనుంచి ఫ్యాన్స్ లో టెన్షన్ పెరిగిపోయింది. దానికి కారణం రీసెంట్ గా శంకర్ నుంచి వచ్చిన ఇండియన్2 దారుణంగా ఫ్లాప్ అవడమే.
ఆ సినిమా ఎఫెక్ట్ ఇప్పుడు గేమ్ ఛేంజర్ మీద పడుతుందని వారి భయం. ఈ నేపథ్యంలో ఇప్పుడు గేమ్ ఛేంజర్ రీషూట్ అని వార్తలొస్తున్నాయి. ఇండియన్2 రిజల్ట్ చూశాక శంకర్ జాగ్రత్త పడుతున్నాడో ఏమో తెలీదు కానీ కొన్ని సీన్స్ విషయంలో శాటిస్ఫై అవలేదని అందుకే వాటిని మళ్లీ షూట్ చేయాలని భావిస్తున్నాడట శంకర్. సినిమా రిలీజ్ అయ్యాక బాధ పడటం కంటే ముందుగానే తప్పులు సరిదిద్దుకోవడం మంచిదని శంకర్ అనుకుంటున్నాడట. మరి ఈ విషయంలో దిల్ రాజు, చరణ్ ఎలా స్పందిస్తారో చూడాలి.













