Game Changer: డల్లాస్‌లో ‘గేమ్ ఛేంజర్’

రామ్‌చరణ్ (Ram Charan) కథానాయకుడిగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ప్రీరిలీజ్ వేడుక డల్లాస్‌లో ఘనంగా జరిగింది. భారీ సంఖ్యలో అభిమానులు ఈ కార్యక్రమానికి విచ్చేశారు. ఏ భారతీయ సినిమాకు చేయని విధంగా విదేశాల్లో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. డల్లాస్ వేదికగా జరిగిన వేడుకకు భారీ స్థాయిలో అభిమానులు తరలివచ్చారు. రామ్‌చరణ్ ఎంట్రీ సందర్భంగా ఆడిటోరియం అభిమానుల కేరింతలతో దద్దరిల్లిపోయింది. ‘స్టార్.. స్టార్.. గ్లోబల్ స్టార్’ అంటూ మార్మోగిపోయింది. ఈ మూవీలో చరణ్ ద్విపాత్రాభినయం చేశాడు. కియారా అడ్వాణీ హీరోయిన్. సునీల్, శ్రీకాంత్, అంజలి, ఎస్జే సూర్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. భారీ బడ్జెట్‌తో నిర్మాత దిల్‌రాజు ఈ మూవీని నిర్మించారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.