గేమ్ ఛేంజర్ నమ్మేలా లేదే..!
రామ్ చరణ్ నుంచి రానున్న గేమ్ ఛేంజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మూడేళ్ల కిందట మొదలైన ఈ సినిమా ఇప్పటికీ రిలీజ్‌కు నోచుకోలేదు. మొత్తానికి షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి ఓ సాంగ్ రిలీజైనప్పటికీ దానికి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
సెకండ్ సింగిల్‌ని ఈ నెలలో రిలీజ్ చేస్తామని వినాయక చవితికి స్పెషల్ పోస్టర్ ద్వారా అనౌన్స్ చేశారు. ఇలా సాంగ్స్ కాకుండా అందరి అటెన్షన్ సినిమాపై మళ్లేలా ఒక అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ ఎప్పటినుంచో మేకర్స్ ను అడుగుతున్నారు. అయితే ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేస్తామని దిల్ రాజు ఇప్పటికే చెప్పాడు కానీ రిలీజ్ డేట్ మాత్రం కన్ఫర్మ్ చేయలేదు.
ఇప్పుడు సడెన్ గా ఈ సినిమా గురించి ఫ్యాన్స్ కు షాకిచ్చే న్యూస్ ఒకటి నెట్టింట ప్రచారమవుతుంది. గేమ్ ఛేంజర్ వచ్చే ఏడాదికి పోస్ట్‌పోన్ కానుందని టాక్ వినిపిస్తోంది. డిసెంబర్ లో పుష్ప2 వస్తోంది. ఆ తర్వాత డిసెంబర్ 20కి ఇప్పటికే తండేల్, రాబిన్ హుడ్ షెడ్యూల్ అయి ఉన్నాయి. ఆ టైమ్ లో గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే మిగిలిన వాటికి నష్టమొచ్చే ఛాన్సుందని వచ్చే ఏడాది ఆరంభంలో మంచి రిలీజ్ డేట్ చూసుకుని గేమ్ ఛేంజర్ ను రిలీజ్ చేస్తే బావుంటుందని మేకర్స్ అనుకుంటున్నారని అంటున్నారు. మరి ఇందులో నిజమెంతన్నది తెలియదు. ఏదేమైనా ఈ విషయంలో మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన వస్తే తప్పించి నమ్మలేం.













