Game Changer: గ్లోబల్ స్టార్ స్పీడు పెంచాల్సిందే!
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) హీరోగా శంకర్(Shankar) దర్శకత్వంలో తెరకెక్కిన గేమ్ ఛేంజర్(Game Changer) సంక్రాంతి కానుకగా జనవరి 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా రిలీజ్ కు మరో 12 రోజులే ఉన్న నేపథ్యంలో ప్రమోషన్స్ ను వేగవంతం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలోనే రామ్ చరణ్ డిసెంబర్ 31న బాలకృష్ణ(Balakrishna) హోస్ట్ చేస్తున్న అన్స్టాపబుల్ షో లో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.
తర్వాత జనవరి 1న ట్రైలర్(Game Changer Trailer) లాంచ్ ఈవెంట్ చేయాలని చూస్తున్నారు. ఈవెంట్ కుదరకపోతే డైరెక్ట్ గా ఆన్ లైన్ లోనే ట్రైలర్ ను రిలీజ్ చేయనున్నారు. ఆ తర్వాత జనవరి 4న రాజమండ్రిలో భారీ ఎత్తున గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్(Game Changer Pre Release Event) ను నిర్వహించనున్నారు. ఈ ఈవెంట్ కు మెగాపవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Pawan Kalyan) హాజరయ్యే అవకాశాలున్నాయి.
ఇప్పటికే నిర్మాత దిల్ రాజు(Dil Raju) పవన్ ను కలిసి ఈవెంట్ కు రావాలని కోరాడు. ఆ తర్వాత 6 నుంచి 8 మధ్యలో చెన్నై, ముంబై, బెంగుళూరు లో వరుసగా ప్రెస్మీట్లు పెట్టాలని చూస్తున్నారు. రిలీజ్ కు చాలా తక్కువ టైమ్ ఉండటంతో గేమ్ ఛేంజర్ టీమ్ పరుగులు పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సోలో రిలీజ్ కాకపోవడం వల్ల పోటీని తట్టుకోవాలంటే గేమ్ ఛేంజర్ నెక్ట్స్ లెవెల్ లో పబ్లిసిటీ చేయాలి. ఆ రకంగానే దిల్ రాజు టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.













