గేమ్ ఛేంజర్కు మరో నెల రోజుల్లో గుమ్మడికాయ కొట్టేస్తారా?
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ప్రస్తుతం రామ్ చరణ్, ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ అనే పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ మొదలై మూడేళ్లు దాటుతున్నా షూటింగ్ మాత్రం ఇంకా పూర్తవలేదు. ఈ సినిమా డైరెక్టర్ ఓ వైపు గేమ్ ఛేంజర్ ను, మరోవైపు ఇండియన్2 ను చేయడంతో గేమ్ ఛేంజర్ డిలే అయింది.
గేమ్ ఛేంజర్ షూటింగ్ రీసెంట్ గానే హైదరాబాద్లో మొదలైంది. చిత్ర యూనిట్ ఇంకా షూటింగ్ పూర్తి చేయకపోవడంతో ఫ్యాన్స్ అసలు గేమ్ ఛేంజర్ ఈ ఏడాది రిలీజవుతుందా లేదా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమా అక్టోబర్ లో రిలీజ్ కానుందని నిర్మాత దిల్ రాజు కూతురు హర్షత తెలిపింది. దీంతో దేవర ప్రీ పోన్ అవుతుందని, ఆ ప్లేస్ లో గేమ్ ఛేంజర్ రానుందని అందరూ అన్నారు. అది జరగాలంటే గేమ్ ఛేంజర్ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని భారీగా ప్రమోషన్స్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరోవైపు షూటింగ్ ఇంకా 30 రోజుల పాటూ జరగనున్నట్లు తెలుస్తోంది. అందులో రామ్ చరణ్ పార్ట్ 10 రోజులని ఇన్ సైడ్ టాక్. ఇదే నిజమైతే జులై స్టార్టిం













