Game Changer: గేమ్ ఛేంజర్ బ్రేక్ ఈవెన్ ఎంతంటే!
శంకర్(Shanakr) దర్శకత్వంలో రామ్ చరణ్(ram Charan) నటించిన సినిమా గేమ్ ఛేంజర్(Game Changer). కియారా అద్వానీ(Kiara Advani) హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దిల్ రాజు(Dil Raju) భారీ బడ్జెట్ తో నిర్మించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో ఇప్పుడు ఈ సినిమా బడ్జెట్, టార్గెట్ గురించి నెట్టింట తెగ డిస్కషన్ జరుగతుంది.
శంకర్ తన సినిమాల కోసం భారీగా ఖర్చు చేస్తాడనే విషయం తెలిసిందే. రెమ్యూనరేషన్లు, ప్రమోషనల్ ఖర్చులు, ప్రొడక్షన్ ఖర్చులు అన్నీ కలిపి ఈ సినిమాకు రూ. 500 కోట్లకు పైగా ఖర్చైందని టాక్. అయితే గేమ్ ఛేంజర్ హక్కులు రూ. 200 కోట్లకు అమ్ముడు పోయాయని తెలుస్తోంది. అంటే థియేట్రికల్ రన్ నుంచి గేమ్ ఛేంజర్ రూ.300 కోట్లు రాబట్టాల్సి ఉంటుంది.
బ్రేక్ ఈవెన్ పూర్తవాలంటే తెలుగు రాష్ట్రాల్లో రూ.120 కోట్లు కలెక్ట్ చేయాలి. తమిళ, కన్నడ, నార్త్, ఓవర్సీస్ లో కలిపి రూ. 150-180 కోట్లు కలెక్ట్ చేయాలంటున్నారు. మరి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వసూళ్లు కలెక్ట్ చేస్తుందోనని అందరూ ఆతృతగా ఎదురుచూస్తున్నారు. నార్త్ లో మంచి కలెక్షన్స్ వస్తే సినిమాకు మంచి లాభాలు రావడం ఖాయం. ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో స్వయంగా తానే డిస్ట్రిబ్యూట్ చేయాలనే ఆలోచనలో దిల్ రాజు ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.













