Game Changer: పాటల కోసమే రూ.90 కోట్లా?
డైరెక్టర్ శంకర్(Shankar) సినిమా అంటే భారీ పనితనానికి పెట్టింది పేరు. ఇండియాలో ఏ ఇతర డైరెక్టర్ ఆయన స్కేల్ లో సినిమాలు చేయలేరు, ఖర్చు పెట్టలేరు. కథ ఎలాంటిదైనా సరే బడ్జెట్ విషయంలో ఆయనసలు కాంప్రమైజ్ అవడు. ప్రతీ ఫ్రేమ్ లోనూ శంకర్ మార్క్ భారీతనం కనిపిస్తుంది. సీన్స్ కోసం వేసే సెట్స్ నుంచి సాంగ్స్ కోసం వేసే సెట్ల వరకు ప్రతీదీ కోట్లతో ఖర్చు పెట్టిస్తాడు.
ఆయన సినిమాల పోస్ట్ ప్రొడక్షన్కు, వీఎఫ్ఎక్స్ కు కూడా ఖర్చవుతుంది. ఎంతో అడ్వాన్డ్స్ టెక్నాలజీని తన సినిమాల్లో వాడతాడు శంకర్. ఇవన్నీ పక్కన పెడితే శంకర్ ఆయన సినిమాల్లోని సాంగ్స్ కోసమే కోట్ల రూపాయలు నిర్మాతతో ఖర్చు పెట్టిస్తాడు. గేమ్ ఛేంజర్(Game Changer) లో మొత్తం ఐదు పాటలుంటే ఆ సాంగ్స్ కోసమే రూ. 92 కోట్ల ఖర్చైందని సమాచారం.
సాధారణంగా శంకర్ సినిమాల సాంగ్స్ కోసం రూ.100 కోట్లు ఖర్చవుతుంది. గేమ్ ఛేంజర్ విషయంలో నిర్మాత దిల్ రాజు(Dil Raju) కు శంకర్ రూ.8 కోట్లు సేవ్ చేసినట్టే. నానా హైరానా(Nana Hyrana) సాంగ్ కోసమే దాదాపు రూ.18 కోట్లకు పైగా ఖర్చైందని మిగిలిన పాటలన్నింటికీ కలిపి 70 కోట్లకు పైగా ఖర్చు పెట్టారని తెలుస్తోంది. గేమ్ ఛేంజర్ లో ఈ సాంగ్స్ అన్నీ ఆడియన్స్ ను మెస్మరైజ్ చేస్తాయని చిత్ర యూనిట్ చెప్తోంది. జనవరి 10న గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది.













