గేమ్ ఛేంజర్ రిలీజ్ తెలిసేదప్పుడే
స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేస్తున్న సినిమా గేమ్ ఛేంజర్. రీసెంట్ గానే ఈ సినిమా షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయింది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. ఇదిలా ఉంటే శంకర్ ఈ సినిమా చేస్తూనే ఇండియన్2 మూవీని రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు.
జులైలో ఇండియన్2 రిలీజ్ కానుంది. గేమ్ ఛేంజర్ అక్టోబర్ లో రిలీజ్ కానుందంటున్నారు కానీ అధికారికంగా ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను దిల్ రాజు నిర్మిస్తున్నాడు. కానీ వాస్తవానికి ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఇండియన్2 రిలీజ్ తర్వాత శంకర్ గేమ్ ఛేంజర్ పై ఫుల్ ఫోకస్ పెట్టనున్నాడట.
ఈ లెక్కన ఆగస్ట్ నుంచి గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తి స్థాయిలో మొదలయ్యే ఛాన్స్ ఉంది. అయితే ఈ సినిమా రిలీజ్ పై ఇప్పట్లో క్లారిటీ వచ్చే అవకాశం లేదట. గేమ్ ఛేంజర్ పోస్ట్ ప్రొడక్షన్ పూర్తైన తర్వాతే రిలీజ్ డేట్ ను గురించిన స్పష్టత వచ్చే ఛాన్సుంది. అన్నీ కుదిరితే ఈ ఏడాది మూడు నెలల్లో గేమ్ ఛేంజర్ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.













