‘గాలిపురం జంక్షన్’ ట్రైలర్ విడుదల
రవి కమల్ సమర్పణలో అభిషేక్ ఆర్ట్స్, ధృవ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం గాలిపురం జంక్షన్ ట్రైలర్ను ఫిలింఛాంబర్లో జరిగిన కార్యక్రమంలో విడుదల చేశారు. మా నూతన అధ్యక్షుడు నరేష్ ప్రముఖ నిర్మాత కొండేటిసురేష్, నిర్మాత లయన్ సాయి వెంకట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. నరేష్ మాట్లాడుతూ ఈ చిత్రం ట్రైలర్ చూశానని చాలా బాగుందన్నారు. చరణ్ బాలాజీ దర్శకత్వం చాలా బాగుందన్నారు. యాక్షన్తో పాటు లవ్, ఎమోషన్ అలాగే రైతు సమస్యలను కూడా ప్రస్తావించారని తెలిపారు. హీరో అభిషేన్ నటన చాలా బాగుందన్నారు.













