Gaddar Film Awards 2024: గద్దర్ అవార్డులు

14 ఏళ్ల తర్వాత తెలంగాణలో సినీ అవార్డుల సంబురం నెలకొంది. ప్రముఖ కవి గద్దర్ పేరుతో తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ ప్రకటించారు. తెలుగు చలన చిత్రాలకు అవార్డులు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించిన విషయం తెలిసిందే. ప్రముఖ కళాకారుడు కవి గద్దర్ (Gaddar) పేరుతో తెలుగు సినిమా అవార్డులు (Telugu Cinema Awards) ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రముఖ నటి జయసుధ నేతృత్వంలో సినీ అవార్డుల జూరి ఏర్పాటు అయ్యింది. ఈ క్రమంలో ఈరోజు (గురువారం) ఉదయం గద్దర్ తెలంగాణ సినిమా అవార్డుల వివరాలను అవార్డుల కమిటీ చైర్మన్ జయసుధ (Awards Committee Chairman Jayasudha) ప్రకటించారు.
తెలంగాణ గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్-2024 ప్రకటన
అవార్డుల జాబితా:
ఉత్తమ మొదటి చిత్రం కల్కి
ఉత్తమ రెండో చిత్రం పొట్టేల్
ఉత్తమ మూడో చిత్రం లక్కీ భాస్కర్
ఉత్తమ బాలల చిత్రం-35 ఇది చిన్న కథ కాదు
ఉత్తమ ఫీచర్ హెరిటేజ్ అవార్డు-రజాకార్
ఉత్తమ నటుడు – అల్లు అర్జున్ (పుష్ప-2)
ఉత్తమ దర్శకుడు – నాగ్ అశ్విన్ (కల్కి)
ఉత్తమ నటి – నివేదా థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
ఉత్తమ గాయని – శ్రేయా ఘోషల్ (పుష్ప-2)
ఉత్తమ స్క్రీన్ ప్లే-వెంకీ అట్లూరి (లక్కీ భాస్కర్)
ఉత్తమ హాస్యనటులు – వెన్నెల కిషోర్, సత్య
ఉత్తమ కొరియోగ్రాఫర్ – గణేష్ ఆచార్య (దేవర)
ఉత్తమ కథా రచయిత – శివ పాలడుగు
ఉత్తమ పుస్తకం – రెంటాల జయదేవ్ (మన సినిమా పుస్తకం)
స్పెషల్ జ్యూరీ అవార్డు – అనన్య నాగళ్ల (పొట్టేల్)
స్పెషల్ జ్యూరీ – దుల్కర్ సల్మాన్ (లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యూరీ – ఫరియా అబ్దుల్లా (మత్తు వదలరా-2)
జూన్ 14న హైటెక్స్‌లో అవార్డుల ప్రదానం.2014-23సంవత్సరాలకు సంబంధించిన అవార్డులను త్వరలో ప్రకటిస్తామన్న జ్యూరీ చైర్‌పర్సన్ జయసుధ