యాస్కిన్ సోలో సినిమా.. వర్కవుట్ అవుతుందా?
ఎన్నో అంచనాల మధ్య రిలీజైన ప్రభాస్ కల్కి 2898ఏడీ, ఆ అంచనాలకు తగ్గట్టే బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. రెండు భాగాలుగా ఈ సినిమా రానుందని అర్థమైపోయింది. ఇదిలా ఉంటే కల్కి సెకండ్ పార్ట్ తర్వాత ఇందులో కమల్ చేసిన యాస్కిన్ క్యారెక్టర్ మీద విడిగా ఒక సినిమా ఉంటుందని, అదెంత వరకు సాధ్యమవుతుందనేది ఆలోచిస్తున్నట్లు నిర్మాత అశ్వినీదత్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
వాస్తవానికి కల్కి ఫస్ట్ పార్ట్ లో కమల్ కనిపించేది పట్టుమని పది నిమిషాలే. ఆ పాత్రకు పెద్దగా డైలాగ్స్ కూడా ఉండవు. ఇండియన్2 ప్రమోషన్స్ లో కమల్ ఈ పాత్ర గురించి మాట్లాడుతూ, తన అసలైన క్యారెక్టర్, నట విశ్వరూపం తర్వాత చూస్తారని చెప్పడం ఆ పాత్రపై ఉన్న అంచనాలను మరింత పెంచేసింది.
ఇదంతా పక్కన పెట్టి ఇక అసలు విషయానికొస్తే యాస్కిన్ పాత్ర మీద సోలో సినిమా ఎంతవరకు వర్కవుట్ అవుతుందనేది చెప్పడం కష్టమే. దానిక్కారణం అది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర కావడమే. కల్కిలో ప్రభాస్, అమితాబ్ ఉన్నారు కాబట్టి యాస్కిన్ పాత్రకు ఆ రేంజ్ హైప్ వచ్చింది. అలా కాకుండా కేవలం కమల్ ఒక్కడే స్క్రీన్ పై కనిపిస్తే ఆడియన్స్ రిసీవ్ చేసుకోవడం కష్టమే. యాస్కిన్ క్యారెక్టర్ తో మరో సినిమా చేసేదీ లేనిదీ పూర్తిగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ నిర్ణయం మీదే డిపెండ్ అయి ఉంటుంది.













