బాలీవుడ్లో మరో పెళ్లి బాజా
బాలీవుడ్లో మరో పెళ్లి బాజా మోగనుంది. స్లమ్‌డాగ్ మిలియనీర్ కథానాయిక ఫ్రిదా పింటో అమెరికన్ ఫొటోగ్రాఫర్ కోరీట్రాన్ను పెళ్లి చేసుకోబోతుంది. రెండేళ్లుగా ఫ్రిదా, కోరీతో ప్రేమలో ఉందన్న విషయం తెలిసిందే. ఇటీవల జరిగిన ప్రియుడి పుట్టినరోజున ఫ్రిదా మరచిపోలేని బహుమతి ఇచ్చారు. సర్ఫ్రైజ్గా అతడితో నిశ్చితార్థం చేసుకొని ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. నా జీవితానికి అర్థం ఇదే. గతంలో కన్నీళ్లకు, ఎదుర్కొన్న పరీక్షలకు ఫలితం ఇదే. పాత ప్రేమికులు ప్రేమ గురించి చెప్పిన దానికీ బలమిదే. ప్రస్తుతం నేను ఎక్కడున్నానో, ఎక్కడివెళ్లాలనుకుంటున్నానో.. నా ప్రతి అడుగుకి గమ్యమిదే. నా లైప్‌లోకి వచ్చి ఎప్పటికీ నిలిచి ఉండే అద్భుతానివి నువ్వే అని కోరీ ట్రాన్ పట్ల తన మనసులో భావాన్ని వ్యకపరిచారు ఫ్రిదా.













