మాస్ పోస్టర్ తో పుష్ప టీమ్ సర్ ప్రైజ్..
బన్నీ పుట్టినరోజును మరింత స్పెషల్ గా మార్చారు పుష్ప టీమ్. ఇప్పటికే పుష్ప ఇంట్రడక్షన్ టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. లారీ డ్రైవర్ గా, స్మగ్లర్ గా పుష్ప రాజ్ చేసిన విధ్వంసానికి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. బన్నీ పెర్పామెన్స్ కి సుకుమార్ డైరక్షన్, దేవీ బ్యాగ్రౌండ్ స్కోర్, మిరోస్లా సినిమాటోగ్రఫీ అన్నీ కలిసి ఈ పుష్ప మాస్ టీజర్ రు టాప్ లో ఉంచాయి. ఇప్పటికే ఫాస్ట్ గా ట్రెండ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ టీజర్ లో బన్నీ లుక్స్, బాడీ లాంగ్వేజ్ తో ఆద్యంతం ఆకట్టుకున్నాడు.
పాన్ ఇండియా లెవల్ లో బన్నీ ని ఆవిష్కరించడానికి సరైన సినిమా పుష్ప అని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. పుష్ప ఇంట్రో ప్రోమోతోనే ఫుల్ ఖుషీ చేసిన ఫ్యాన్స్ ను మరింత ఆనందంలో ముంచెత్తడానికి పుష్ప మేకర్స్ తగ్గేదేలే అంటూ మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేసి, మాస్ చూపించారు. ఆ పోస్టర్ లో బన్నీ ఒక బైక్ పై కూర్చుని చేయి పైకెత్తి చూపిస్తున్నాడు. నల్ల కళ్లద్దాలు పెట్టుకుని వైట్ షర్ట్ ని టక్ చేసుకుని కోపంగా చూస్తూ పుష్ప రాజ్ రగ్గడ్ లుక్ లో స్టైలిష్ గా కనిపిస్తున్నాడు.
రిలీజ్ డేట్ లేకుండా ఈ పోస్టర్ ని రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ రిలీజ్ డేట్ పై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. దీంతో పుష్ప రిలీజ్ పోస్ట్ పోన్ అవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిజం చేస్తున్నారా అని డౌట్స్ వస్తున్నాయి. ఇదిలా ఉంటే, ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో డైరక్టర్ సుకుమార్ పుష్ప ని తెరకెక్కిస్తున్నాడు. ఇందులో బన్నీకి జోడీగా రష్మిక కనిపించనుండగా, మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ కు విలన్ గా నటిస్తుండగా, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్ లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్యంశెట్టి మీడియా లు కలిసి భారీ బడ్జెట్ తో పుష్ప సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.













