మెగాస్టార్‌కు హీరోయిన్స్ కావలెను!
ఈ మధ్య టాలీవుడ్ లోని సీనియర్ హీరోలకు ఓ హీరోయిన్ ను సెట్ చేయడమే కష్టమంటుంటే, అలాంటిది ఏకంగా ఐదుగురు హీరోయిన్లను సెట్ చేయడమంటే మాటలు కాదు. యంగ్ డైరెక్టర్ వశిష్ఠతో చిరంజీవి భారీ ఫాంటసీ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. విశ్వంభర టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్‌గానే సెట్స్ పైకి వెళ్లింది.
ఈ సినిమా కోసం ఇప్పుడు ఒకరు కాదు, ఇద్దరు కాదు ఏకంగా ఐదుగురు హీరోయిన్లు కావాలట. ముందు అనుష్కను అనుకున్నారు కానీ బల్క్ డేట్స్ ఇవ్వలేనని చెప్పడంతో ఇప్పుడు ఆ ప్లేస్ లోకి త్రిష వచ్చిందని టాక్. మృణాల్ ఠాకూర్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని తెలుస్తోంది. మరో ముగ్గురు బ్యాలెన్స్ ఉన్నారు.
దీని కోసం మెహరీన్, రాశీఖన్నా,తమన్నా, పూజా హెగ్డే, రీతూ వర్మ లాంటి వారిని ట్రై చేస్తున్నారట. ఆచార్య ఇష్యూ అయింది కాబట్టి కాజల్ ఈ సినిమా చేయకపోవచ్చు. మరి ఫైనల్ గా చిరూ పక్కన నటించే ఛాన్స్ ఎవరికి వస్తుందన్నది తెలియాలంటే కాస్త టైమ్ పట్టనుంది. ఇప్పటికే ఎం.ఎం కీరవాణి ఈ సినిమా కోసం రెండు పాటలు కూడా పూర్తి చేశాడని, అందులో టైటిల్ సాంగ్ చాలా బాగా వచ్చిందని టాక్. ఈ సినిమా 2025 సంక్రాంతి బరిలో నిలపాలని మేకర్స్ ట్రై చేస్తున్నారట.













