సీటీమార్ లో మిల్కీబ్యూటీ లుక్ విడుదల
మిల్కీబ్యూటీ తమన్నా కబడ్డీ.. కబడ్డీ అంటూ తన జట్టుకు శిక్షణనిస్తూ కబడ్డీ కోచ్‌గా అందరిచేత సీటీమార్ అని ప్రశంసలు అందుకోవడానికి రెడీ అవుతోంది. గోపీచంద్ కథానాయకుడిగా సంపత్‌నంది దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం సీటీమార్. శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంలో తమన్నా కబడ్డీ కోచ్ జ్వాలరెడ్డిగా ఓ విభిన్నమైన పాత్రలో కనిపించబోతోంది. ఇటీవల ఆమె లుక్కు సంబంధించిన ఓ ఫోటోను విడుదల చేశారు. ఈ సందర్భంగా తమన్నా మాట్లాడుతూ స్ఫూర్తివంతంగా సాగుతూ సవాలుతో కూడిన పాత్ర ఇది. జ్వాల రెడ్డి పాత్ర నా కెరీర్లో ప్రత్యేకంగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది అని చెప్పింది. ఇటీవలే హైదరాబాద్‌లో కొత్త షెడ్యూల్ మొదలపెట్టాం. ఇందులో తమన్నా జాయిన్ అయ్యారు. నిర్విరామంగా ఈ షెడ్యూల్‌ను జరిపి వేసవిలో చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం అని నిర్మాత తెలిపారు. దివంగన సూర్యవన్షి, తరుణ్ అరోరా, భూమిక, పోసాని కృష్ణమురళి, రావు రమేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: సౌందర్‌రాజన్, సంగీతం: మణిశర్మ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సంపత్‌నంది.






