సస్పెన్స్ థ్రిల్లర్ ఎవరు ?
అడివి శేష్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఎవరు. వెంకట్ రామ్‌జీ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. రెజీనా కథానాయిక. నవీన్‌చంద్ర కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. దర్శకుడు చిత్ర విశేషాలు తెలియజేస్తూ సెస్పెన్స్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ సినిమాలో అడివి శేష్ పోలీస్ అధికారి పాత్రలో కనిపించబోతున్నారు. పరిశోధనాత్మక థ్రిల్లర్‌గా మెప్పిస్తుంది అన్నారు. ఆగస్ట్ 23న చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వంశీ, సంగీతం: శ్రీచరణ్ పాకాల, ఆర్ట్: అనినాష్ కొల్ల, సంభాషణలు: అబ్బూరి రవి, దర్శకత్వం:వెంకట్ రామ్‌జీ.













