నరేంద్ర మోదీ గా వివేక్ ఒబెరాయ్ ఫస్ట్ లుక్ విడుదల
భారత ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ లీడ్ రోల్ లో నటిస్తున్నాడు. ఒమంగ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను చిత్రయూనిట్ విడుదల చేసింది. పీఎం నరేంద్రమోదీ టైటిల్ తో వస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో వివేక్ ఒబెరాయ్ ప్రధాని మోదీ హావభావాలతో కనిపిస్తున్నాడు. పోస్టర్ బ్యాక్ డ్రాప్ లో ఓ వైపు జాతీయ జెండా రెపరెపలాడుతోండగా, మరోవైపు ప్రజలు కనిపిస్తున్నారు. పీఎం నరేంద్రమోదీ ఫస్ట్ లుక్ పోస్టర్ సినిమాపై అంచనాలను పెంచేస్తుంది. సందీప్ ఎస్ సింగ్, సురేశ్ ఒబెరాయ్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 15 నుంచి సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, హిందీ భాషలతో కలిపి దాదాపు 23 భాషల్లో విడుదల చేయనున్నారు. బయోపిక్కు సంబంధించిన పూర్తి వివరాలను చిత్రబృందం త్వరలో ప్రకటించనుంది.













