అంధురాలిగా మరో ఛాలెంజింగ్ క్యారెక్టర్లో నయనతార!
ప్రస్తుతం సౌత్‌లో నంబర్ వన్ హీరోయిన్ అంటే నయనతారే. అందులో ఎలాంటి సందేహం లేదు. తను చేసే ప్రతి సినిమా విభిన్నంగా ఉండాలని కోరుకునే నయనతార. దానికి తగ్గట్టుగానే సినిమాలు చేస్తూ విజయాలు అందుకుంటోంది. తమిళ్లో వరసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉన్న నయన ఇప్పుడు మరో కొత్త సినిమాతో రాబోతోంది. ప్రస్తుతం ‘కాదువాకుల రండు కాదల్, మూక్కుత్తి అమ్మన్ , అన్నాత్తే’ సినిమాలు చేస్తున్న ఆమె ‘నెట్రిక్కణ్’(మూడో కన్ను) అనే ఓ కొత్త సినిమాలో అంధురాలి పాత్రను చేస్తోంది. `గృహం` చిత్రానికి దర్శకత్వం వహించిన మిలింద్ రో ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా. నయనతారకు కాబోయే భర్త విఘ్నేష్ శివన్ నిర్మిస్తున్నాడు. మర్డర్ మిస్టరీతో తెరకెక్కుతోన్న ‘నెట్రిక్కణ్’ లుక్‌ను ఇటీవల సమంత అక్కినేని, గౌతమ్ మీనన్, అనిరుధ్ రవిచంద్రన్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.
తలకి రక్తం కారుతుండగా.. చేతిలో ఒక ఆయుధంతో ఎంతో ఫెరోషియస్‌గా కనిపిస్తున్న నయన ఎవరిపైనో ఎటాక్ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించే నయన ఓ ప్రమాదంలో కంటిచూపు కోల్పోతుంది. ఛాలెంజింగ్ పాత్రలు చేసేందుకు ఎప్పుడూ ఆసక్తి చూపే నయన ఈ సినిమాలో అంధురాలి పాత్రను కూడా ఎంతో ఛాలెంజింగ్‌గా తీసుకొని చేస్తోంది. ఇప్పటికే చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నయన ఈ సినిమాతో అందరిలోనూ ఆసక్తి రేకెత్తిస్తోంది. నయన కెరీర్లో ఇది మరో మంచి సినిమా అవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.













