సర్దార్ గా ఆకట్టుకుంటున్న కార్తి
హీరో కార్తి తన కెరీర్ మొదటి నుంచి విభిన్న సినిమాలను చేసుకుంటూ వస్తున్నాడు. తను ఏదైనా సినిమా చేస్తున్నాడంటే అందులో ఏదో స్పెషల్ ఉందనుకునే రేంజ్ ను క్రియేట్ చేసుకున్నాడు కార్తి. మొదటి సినిమా పరుత్తి వీరన్ లో సూర్య ఒక మొరటోడిలా కనిపిస్తాడు. స్టార్ హీరో సూర్య తమ్ముడు ఇలాంటి క్యారెక్టర్ తో సినీ ఇండస్ట్రీకి పరిచయమయ్యాడంటే కార్తి ఆలోచనా తీరును అర్థం చేసుకోవచ్చు .
తను అందరిలా కాదని, తను డిఫరెంట్ అని ఎప్పటికప్పుడు ప్రూవ్ చేసుకుంటూ వస్తున్న కార్తి, తన విలక్షణతనను యుగానికి ఒక్కడు, నాపేరు శివ, ఖాఖీ, ఖైదీ లాంటి సినిమాలను చేసి బాక్సాఫీస్ వద్ద కూడా మంచి విజయం అందుకున్నాడు. ఇప్పుడు కార్తి సర్దార్ గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. లేటెస్ట్ ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యాయి.
పీఎస్ మిత్రన్ డైరక్షన్ లో రానున్న ఈ సినిమాలో కార్తి ఒక మధ్య వయస్కుడిగా కనిపిస్తున్నాడు. నెరిసిన జుట్టు, గడ్డంతో కార్తి లుక్ అల్టిమేట్ అనిపిస్తుంది. కార్తి ఎప్పటి లాగే సమ్ థింగ్ డిఫరెంట్ గా ఏదో చేయబోతున్నాడనే విషయం ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థమైపోతుంది. సాల్ట్ పెప్పర్ లుక్ లో ఉన్న కార్తీ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఇకపోతే మోషన్ పోస్టర్ లో పాకిస్తాన్, చైనా అని చూపించడంతో సర్దార్ బార్డర్ లో జరిగే సమస్యల ఆధారంగా తెరకెక్కనుందంటున్నారు. రజిషా విజయన్, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు జివి ప్రకాష్ సంగీతమందిస్తుండగా, ఎస్. లక్ష్మణ్ కుమార్ సర్దార్ ను నిర్మిస్తున్నారు.













