సైరాలో అమితాబ్ ఫస్ట్ లుక్ విడుదల
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ 76వ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయన కీలక పాత్రలో నటించిన సైరా నరసింహారెడ్డి సినిమాలోని మోషన్ పోస్టర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. మెగాస్టార్ చిరంజీవి ఈ చిత్రంలో టైటిల్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో అమితాబ్ గోసాయి వెంకన్న పాత్రలో కన్పించబోతున్నారు. ఇందులో ఆయన నరసింహారెడ్డికి గురువుగా నటించారు. గురువు పాత్రలో అమితాబ్ ఒదిగిపోయారు. ఆయన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితాధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో యుద్ధ సన్నివేశాలను హాలీవుడ్ నిపుణుల ఆధ్వర్యంలో తెరకెక్కిస్తున్నట్లు సమచారం. సురేందర్‌రెడ్డి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్‌చరణ్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రానికి రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.













