ఆచార్య ఫస్ట్ లుక్ అప్పుడే…
మెగాస్టార్ చిరంజీవి తాజా సినిమా ఆచార్య. కొరటాల శివ దర్శకుడు. కరోనా వైరస్ కారణంగా షూటింగ్ తాత్కాలికంగా వాయిదా పడింది. లేదంటే ఈపాటికే పూర్తయ్యేదని చిత్ర సంబంధికులు తెలిపారు. ఈ సినిమాలో చిరంజీవి లుక్ ఎలా ఉండబోతోందనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఫస్ట్ లుక్ విడుదలకు ముహూర్తం నిర్ణయించినట్టు తెలిసింది. శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ రెండవ తేదీన విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. ఇటీవలే చిరంజీవి సోషల్ మీడియాలోకి ప్రవేశించిన విషయం తెలిసిందే. దీని ద్వారా ఆయన అభిమానులకు సందేశం ఇస్తున్నారు.













