నితిన్ తో ఐకాన్ అంటే బన్నీ ఫ్యాన్స్ ఊరుకుంటారా?
వేణు శ్రీరామ్ తన తర్వాతి సినిమాను యంగ్ హీరో నితిన్ తో ఫిక్స్ చేసుకున్నాడని టాక్. ఈ సినిమా కూడా దిల్ రాజు బ్యానర్ లో నే ఉండనుంది. అయితే దిల్ రాజు, వేణు శ్రీరామ్ కాంబో అనగానే అందరికీ గుర్తొచ్చేది ఐకాన్ సినిమా గురించే. ఈ సినిమాలో ఆల్రెడీ అల్లు అర్జున్ తో దిల్ రాజు అనౌన్స్ కూడా చేసేశాడు.
కానీ పుష్ప1తో భారీ క్రేజ్ తెచ్చుకున్న అల్లు అర్జున్.. వేణు శ్రీరామ్ లాంటి డైరెక్టర్ తో పనిచేయడానికి ఆసక్తి చూపించకపోవడంతో ఈ సినిమా తాత్కాలికంగా ఆగిపోయింది. ఐకాన్ కథ నచ్చినప్పటికీ తన క్రేజ్ ను తగ్గించుకుని చిన్న డైరెక్టర్ తో సినిమా చేయడమెందుకని బన్నీ దాన్ని అలా పక్కకి పెట్టాడు. అయితే ఇన్నాళ్లూ బన్నీ కోసం వెయిట్ చేసిన వేణు శ్రీరామ్ ఇప్పుడు నితిన్ తో సినిమాను ఫిక్స్ చేసుకోవడంతో బన్నీ కోసం అనుకున్న కథనే నితిన్ తో చేస్తున్నాడా అని అందరికీ అనుమానాలొస్తున్నాయి.
వేణు శ్రీరామ్ నిజంగా బన్నీకి చెప్పిన స్టోరీతోనే నితిన్ తో కూడా సినిమా చేసినప్పటికీ, టైటిల్ మాత్రం ఐకాన్ అని అయితే పెట్టరు. ఎందుకంటే పుష్ప తర్వాత బన్నీ ఐకాన్ స్టార్ అని టైటిల్ ఇచ్చేశారు. కాబట్టి నితిన్ ఈ టైటిల్ పెట్టుకుంటే బన్నీ ఫ్యాన్స్ తగులుకుంటారు కాబట్టి ఆ ధైర్యం చేయడు నితిన్. మరి నితిన్ తో దిల్ రాజు బ్యానర్ లో వస్తున్న సినిమా కథేంటి అన్నది తెలియాలంటే కొన్నాళ్లు ఆగాల్సిందే.













