డైరెక్టర్ల మధ్య ట్విట్టర్ వార్..
బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఇటీవల సౌత్ సినిమాల్ని ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ సినిమాలు ఫిల్మ్ ఇండస్ర్టీని సర్వ నాశనం చేస్తున్నాయని అన్నారు. అలాగే `పుష్ప, కాంతార` లాంటి సినిమాలు ప్రేక్షకుల్ని మార్చేసాయని,ఇకపై సినిమాలు చేయాలంటే తమ మేకింగ్ స్టైల్ ని దర్శకులు మార్చుకోవాల్సిందేనని అన్నారు.
ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే చాలా కౌంటర్లు పడ్డాయి. తోటి దర్శకులే ఆయనకు ఫుల్ కౌంటర్లు వేశారు. తాజాగా అనురాగ్ కశ్యప్ పై బాలీవుడ్ సంచలన దర్శకుడు వివేక్ అగ్ని హోత్రి తనదైన శైలిలో బదులిచ్చాడు. అనురాగ్ వ్యాఖ్యలతో నేను ఏకీభవించను. ఇండస్ర్టీని సౌత్ సినిమాలు మార్చేయడం ఏంటి? నాన్సెన్స్! అంటూ ఘాటుగా స్పందించారు.
దీనికి స్పందిస్తూ “ఇది మీ తప్పు కాదు. మీ సినిమాల రీసెర్చ్ అనేది నా సంభాషణలపై మీరు చేసిన ట్వీట్ తరహాలోనే ఉంది. మీ పరిస్థితి.. మీ మీడియా పరిస్థితి కూడా అలాగే ఉంది. తదుపరి కొంత తీవ్రమైన రీసెర్చ్ చేస్తే బాగుంటుంది” అని అనురాగ్ కౌంటర్ గా మరో ట్వీట్ చేశారు.
దీంతో వివేక్ తీవ్రంగా సమాధానమిస్తూ `ది కాశ్మీర్ ఫైల్స్` సినిమా కోసం నాలుగు సంవత్సరాల పాటు చేసిన రీసెర్చ్ అంతా అబద్దం అని నిరూపించండి. అలాగే గిరిజా టికూ.. బికె గంజు.. ఎయిర్ఫోర్స్ హత్య.. నడిమార్గ్ – అన్నీ అబద్ధాలేదనా.. 700 మంది పండితుల వీడియోలన్నీ అవాస్తవాలేనా? హిందువులు ఎవరూ చనిపోలేదంటారా? ఆ తర్వాత నేను మరోసారి తప్పు చేయను అని ఆయన కౌంటర్ వేసారు.
ప్రస్తుతం ఈ ట్వీట్లు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. తాడిని తన్నే వాడుంటే..వాడి తలని కూడా తన్నేవాడు మరొకడు ఉంటాడు అన్న సంగతి ఇప్పటికైనా గ్రహిస్తే మంచిదంటూ నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఈ ట్విట్టర్ వార్ ఇంకెంత దూరం వెళ్తుందో చూడాలి.













