రాజ్ కుమార్ హిరాణీకి అంతర్జాతీయ గౌరవం
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు రాజ్‌కుమార్ హిరాణీకి అంతర్జాతీయ గౌరవం దక్కింది. 22వ షాంగై అంతర్జాతీయ చిత్రోత్సవాల జ్యూరీ సభ్యుడిగా ఆయనకు అవకాశం దక్కింది. ప్రపంచవ్యాప్తంగా పలువురు సినీ ప్రముఖులు ఈ జ్యూరీలో సభ్యులుగా ఉంటారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సినిమాకు పేరు తెచ్చిన వాళ్లతో హిరాణీ ఒకరు. త్రీ ఇడియట్స్ చిత్రంతో అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకోవడమే కాదు చైనా ప్రేక్షకుల్నీ మెప్పించారు. గత ఏడాది హిరాణీ తెరకెక్కించిన సంజు బాక్సాఫీసు వద్ద భారీ విజయం అందుకొంది. షాంగై చిత్రోత్సవ జ్యూరీలో ఇటాలియన్ దర్శకుడు పాలో జెనోవీస్, చైనా నటి జావో, చైనా నటుడు వాంగ్ జింగ్‌చున్ తదితరులు సభ్యులుగా వ్యవహరించనున్నారు. ఈ మధ్యే మలేషియా అంతర్జాతీయ చిత్రోత్సవానికి ప్రెసిడెంట్‌గా రాజ్‌కుమార్ హిరాణీ పేరుని ప్రకటించారు.













