ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కు మంత్రి శుభాకాంక్షలు
కొత్తగా ఎన్నికైన ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్‌కి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ శుభాకాంక్షలు తెలిపారు. సెక్రటేరియట్‌లోని మంత్రిని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ మర్యాదపూర్వకంగా కలిసిది. అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్‌కొండేటి, ప్రధాన కార్యదర్శి ఇ.జనార్ధనరెడ్డి, ఆయనకు పుష్పగుచ్చం అందజేశారు. అనంతరం అధ్యక్షుడు సురేష్ కొండేటి అసోసియేషన్పరంగా ఉన్న కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. వాటి పరిష్కారానికి ఆయన సానుకూలంగా స్పందించారు. క్రిటిక్ అసోసియేషన్ సినిమాలో కీలక పాత్ర పోషిస్తుందనీ, సభ్యులకు ప్రభుత్వపరంగా అందాల్సిన సౌకర్యాలను తప్పకుండా అందేలా చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రభు, ఉపాధ్యక్షులు డి.జి భవాని, సజ్జా వాసు, కోశాధికారి ఎం.ఎస్. భూషన్, కార్యవర్గ సభ్యుడు మురళీ (శక్తిమాన్) తదితరులు పాల్గొన్నారు.













