ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఫిలిం జర్నలిస్టులకు మనీ ట్రాన్సఫర్ 2. O
కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ విధించడంతో సినిమా రంగానికి చెందిన సినీ పాత్రికేయులు కూడా ఇబ్బందులు ఎదుర్కోక తప్పలేదు. తెలుగు సినీ పరిశ్రమ కార్య కలాపాలు స్తంభించడంతో ప్రతీరోజూ ప్రెస్ మీట్స్‌లో బిజీగా ఉండే సినీ పాత్రికేయులు కూడా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. వారికి ఆసరాగా నిలవాలన్న ఉద్దేశ్యంతో సభ్యులందరికీ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ద్వారా దాదాపు మెంబర్లు అందరికీ పోన్లు చేసి ఎలాంటి తారతమ్యం లేకుండా, వద్దన్న వారిని వదిలేసి కమిటీ సభ్యుల సహకారంతో గత నెల ఏప్రిల్ 13వ తేదీన 87 మంది మెంబర్స్‌కి రూ. 5,000 చొప్పున వారి అకౌంట్లోకి నెప్టీ ద్వారా ట్రాన్స్ఫర్ చేసిన విషయం తెలిసిందే. అలాగే మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ఏర్పడిన సిసిసి ద్వారా నిత్యావసర సరుకులు కూడా సినిమా జర్నలిస్టులకు అందించడం జరిగింది. ఇప్పుడు లాక్డౌన్ మే నెలాఖరు వరకు పొడిగించిన నేపథ్యంలో ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులకు మళ్లీ ఈసారి రూ. 3,000 చొప్పున ఇవ్వాలని కమిటీ సభ్యులు తీర్మానించుకుని వద్దన్న వారిని వదిలేసి మరో మారు 89 మంది సభ్యులకు 2020 మే 19న మంగళవారం రోజు వారి వారి అకౌంట్‌కు ఒక్కొక్కరికి మూడు వేల రూపాయల చొప్పున నేఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినట్లుగా అసోసియేషన్ అధ్యక్షుడు సురేష్ కొండేటి తెలిపారు.
ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘కమిటీ సభ్యులందరి సహాయ సహకారాలతో రెండో విడతగా ఈరోజు అనగా మంగళవారం వద్దన్న వారికి వదిలేసి 89 మంది మెంబర్స్‌కి ఒక్కొక్కరికి మూడు వేల రూపాయలు చొప్పున పంపించాం. సినిమా ఇండస్ట్రీలోని 24 క్రాప్ట్స్‌కి ఎప్పుడూ ముందుండి వారి గురించి ప్రజలకు చేరవేసేది మా సినీ పాత్రికేయ కుటుంబమేనని చెబుతూ.. మీరు సినీ కార్మికుల సంక్షేమం కోసం చేసే మంచి పనుల విషయంలో సినీ పాత్రికేయులను కూడా దృష్టిలో పెట్టుకోవాలని ఈ సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ పెద్దలను కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
జనరల్ సెక్రటరీ జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘సమిష్టిగా అందరూ కలిసి పనిచేస్తున్నాం. కమిటీ సభ్యులందరి సహకారంతో ముందుకు వెళ్తున్నాం. ఇలాంటి విపత్తు ఎప్పుడూ రాకూడదని కోరుకుంటున్నాను’’ అని అన్నారు.
ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ సభ్యులైన 89 మందికి ట్రాన్స్ఫర్ చేయమని రెండు చెక్కుల రూపంలో 2 లక్షల 67 వేల రూపాయల చెక్కులను ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ టి సీతారాములుకి.. ఎఫ్.సి.ఏ అధ్యక్షుడు సురేష్ కొండేటి, జనరల్ సెక్రటరీ జనార్దన్ రెడ్డి, ట్రెజరర్ భూషణ్, కమిటీ సభ్యులు సాయి రమేష్, గౌరవ సలహాదారు లక్ష్మణరావు అందించారు. కోవిద్ 19 లాక్ డౌన్ క్రైసిస్ సమయంలో ఓకో సభ్యుడికి రూ. 8,000 మరియు సీసీసీ ద్వారా బియ్యం నిత్యావసర సామగ్రిని అందచేయడం ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ కార్య నిర్వాహక సభ్యులను అభినందించ తగ్గ విషయం.













