సూపర్ స్టార్ కు అరుదైన గౌరవం!
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ జీవిత కథను తమిళ పాఠ్యపుస్తకాల్లో చేర్చారు. ఆయన జీవితానికి సంబంధించిన కొన్ని అంశాలను మాత్రమే చేర్చినట్టు తెలిసింది. ఒక సినీస్టార్ జీవితాన్ని పాఠ్యపుస్తకంలో చేర్చడం అరుదు. తమిళనాడులో మూడు దశాబ్దాలకుపైగా సూపర్‌స్టార్‌గా వెలుగొందుతున్న రజనీకాంత్‌కు ఈ గౌరవం దక్కడం పట్ల ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై తమిళ స్టార్ అధినేత సీమాన్ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఐదవ తరగతి పుస్తకంలో రజనీకి సంబంధించిన అంశాలను ప్రభుత్వం చేర్చింది. పాఠ్యపుస్తకాల్లో సినీ స్టార్లకు సంబంధించిన విషయాలను బోధించడం సరికాదని సీమాన్ అంటున్నారు. ఆయన దీనిపై ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. రజనీకాంత్కంటే కమల్ మాసన్ ఎంతో ఉత్తమనటుడని సీమాన్ కొనియాడారు.













