Fauji: ఫౌజీ షూటింగ్ పై లేటెస్ట్ అప్డేట్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. మారుతి(Maruthi) దర్శకత్వంలో ది రాజా సాబ్(The Rajasaab) అనే పాన్ ఇండియా సినిమాను చేస్తున్న ప్రభాస్, సీతారామం(Sitaramam) ఫేమ్ హను రాఘవపూడి(Hanu Raghavapudi) తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. సెకండ్ వరల్డ్ వార్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతుందని ఇప్పటికే లీకులొస్తున్నాయి.
ఈ రెండు సినిమాలను వీలైనంత త్వరగా పూర్తి చేసి సందీప్ రెడ్డి వంగా(Sandeep Reddy Vanga) దర్శకత్వంలో స్పిరిట్(Spirit) ను సెట్స్ పైకి తీసుకెళ్లాలని ప్రభాస్ ఎంతో ఆతృతగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో హను రాఘపూడి సినిమాపై ఓ న్యూస్ వినిపిస్తోంది. మొన్నటివరకు షూటింగ్ లో గాయపడి ఇటలీలో రెస్ట్ లో ఉన్న ప్రభాస్ రీసెంట్ గా హైదరాబాద్ వచ్చాడు.
హైదరాబాద్ రాగానే రాజా సాబ్ కు డబ్బింగ్ చెప్పడం మొదలుపెట్టిన ప్రభాస్, మరో రెండ్రోజుల్లో హను రాఘవపూడి సినిమా షూటింగ్ లో జాయిన్ కానున్నట్టు తెలుస్తోంది. ప్రభాస్ పాల్గొనబోయే ఈ కొత్త షెడ్యూల్ దాదాపు 45 రోజుల పాటూ నిర్విరామంగా జరగనుందని, ఈ షెడ్యూల్ తో చాలా వరకు ప్రభాస్ కు సంబంధించిన షూటింగ్ పూర్తవుతుందని తెలుస్తోంది. ఇమాన్వీ ఇస్మాయెల్(Imanvi Esmael) హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు ఫౌజీ(Fauji) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.