టాలెస్ట్ హీరోయిన్ డ్రీమ్ రోల్ భలేగుందే..
జాతి రత్నాలు సినిమాతో హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయమైన హైదరాబాదమ్మాయి ఫరియా అబ్దుల్లా నేచురల్ బ్యూటీగా మంచి పేరే తెచ్చుకుంది. అంతే కాదు జాతి రత్నాలు సక్సెస్ లో ఈమె పాత్ర కూడా చాలానే ఉంది. టాలీవుడ్ లో టాలెస్ట్ హీరోయిన్ గా పేరందుకున్న ఫరియాకు జాతి రత్నాలు సక్సెస్ తర్వాత వరుసగా మంచి ఆఫర్లే వస్తున్నాయి. తెలుగు లో మాత్రమే కాకుండా వేరే భాషల నుంచి వచ్చే ఆఫర్ల ను కూడా అందుకుంటూ ముందుకెళ్తుంది. అలాంటి ఫరియా తన డ్రీమ్ రోల్ గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వూలో మాట్లాడి అందరూ షాక్ అయ్యేలా చేసింది.
ఫరియా డ్రీమ్ రోల్ ఏంటంటూ ప్రశ్నించగా సైకోగా నటించాలనుందని చెప్పుకొచ్చింది. అలాంటి రోల్స్ చేసినప్పుడే మనలో ఉన్న యాక్టింగ్ స్కిల్స్ తెలుస్తాయి. మనలో ఉన్న టాలెంట్ ను బయటకు పెట్టేందుకు నెగిటివ్ షేడ్స్ ఉండే క్యారెక్టర్లే చేయాలని తన మనసులోని మాటను బయటపెట్టింది ఫరియా. అంతే కాదు ఆఫర్లొచ్చాయని అన్నీ సినిమాలు చేసి ఎక్కువ సినిమాలు చేసిన హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలనుకోవట్లేదని, మంచి సినిమాలు మాత్రమే చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పింది. ఇప్పటికే రవితేజ తో సినిమాలో ఛాన్స్ కొట్టేసిన ఫరియా తన తర్వాతి సినిమా విషయం లో మాత్రం తన నుంచి ఇప్పటికీ ఏ క్లారిటీ ఇవ్వట్లేదు.













