Nagarjuna: నాగార్జున సోలో సినిమా కోసం ఫ్యాన్స్ పడిగాపులు
టాలీవుడ్ కింగ్ నాగార్జున(Nagarjuna) ఈ మధ్య సినిమాల వేగాన్ని చాలా తగ్గించాడు. ఒకప్పుడు ఓ సినిమా సెట్స్ లో ఉండగానే మరో సినిమాను లైన్ లో పెట్టే నాగ్ ఈ మధ్య బాగా గ్యాప్ తీసుకుంటున్నాడు. దీనికి కారణం నాగ్ మెచ్చే కథలతో డైరెక్టర్లు ఆయన్ని సంప్రదించకపోవడమే అని తెలుస్తోంది. ఈ ఇయర్ నా సామిరంగ(Naa Samiranga) సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చిన నాగార్జున ఆ సినిమా సక్సెస్ మీట్లో ఇక మీదట తన నుంచి ప్రతీ సంక్రాంతికి ఓ సినిమా వస్తుందని చెప్పాడు.
ఫ్యాన్స్ కు మాటైతే ఇచ్చాడు కానీ నచ్చిన కథ రాకపోవడం వల్ల నాగ్ ఇప్పటివరకు సోలో హీరోగా సినిమాను అనౌన్స్ చేయలేదు. నా సామిరంగ డైరెక్టర్ విజయ్ బిన్నీ(Vijay Binni)తో మరో సినిమా చేస్తాడన్నారు కానీ ఎందుకో నాగ్ వెనుకడుగేస్తున్నట్లు తెలుస్తోంది. వేరే కథలు వింటున్నప్పటికీ అవేవీ వర్కవుట్ అవడం లేదని అర్థమవుతుంది.
ఒకప్పుడు టాలీవుడ్ ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ తో యూత్ ని ఎట్రాక్ట్ చేయాలని ట్రై చేసిన నాగ్ ఆ తర్వాత రూట్ మార్చి రొమాంటిక్ ఎంటర్టైనర్లు చేశాడు. ఇప్పుడు ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ తో ఆడియన్స్ ను అలరిస్తున్నాడు. ప్రస్తుతం ధనుష్(Dhanush) తో కలిసి కుబేర(Kubera), రజినీకాంత్(Rajinikanth) తో కలిసి కూలీ(Coolie) సినిమాలు చేస్తున్న నాగ్ ఆ రెండు సినిమాలు పూర్తి చేసిన తర్వాతే సోలో సినిమా గురించి ఆలోచించనున్నారని తెలుస్తోంది. నాగ్ తర్వాత ఎవరితో సినిమా చేస్తాడా అని అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.













