నాగ్ ఫ్యాన్స్ కు కొనసాగుతున్న సస్పెన్స్
నాగార్జున నుంచి సినిమా వచ్చి చాలా నెలలైంది. ది ఘోస్ట్ తర్వాత మరో సినిమాను సైన్ చేయలేదు నాగ్. రైటర్ ప్రసన్న కుమార్ బెజవాడతో సినిమా అనుకున్నారు కానీ ఆ సినిమా క్యాన్సిల్ అయినట్లే అనిపిస్తుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఇప్పటి వరకు ఎవరూ నోరు మెదపట్లేదు. మళ్లీ ఈ మధ్య ఆరెక్స్100 డైరెక్టర్ అజయ్ భూపతితో సినిమాకు నాగ్ ఓకే చెప్పాడని తెలుస్తోంది.
కానీ ఈ సినిమా గురించి కూడా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. మరి మంగళవారం సినిమా రిలీజ్ అయ్యాక ఈ సినిమాను అనౌన్స్ చేస్తారో లేక స్క్రిప్ట్ వర్క్ కు ఇంకా టైమ్ పడుతుందో తెలియాల్సి ఉంది. ఈ టైమ్ లో నాగ్ బిగ్ బాస్-7 కోసం రెడీ అవుతున్నాడు. ఈ సారి కాస్త డిఫరెంట్ గా నాగ్ ఈ సీజన్ లో కనిపించనున్నాడు.
కానీ ఫ్యాన్స్ నాగ్ ను చూడాలనుకుంటుంది బిగ్ బాస్ షో లో కాదు. వెండితెరపై సినిమాల్లో. నాగ్ కెరీర్ తో పాటూ చైతూ, అఖిల్ కెరీర్లు కూడా ఫ్లాపుల్లో ఉండటం అక్కినేని ఫ్యాన్స్ కు నిరాశను కలిగిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కినేని హీరోలు చాలా జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే చైతూ చందూ మొండేటి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా, అఖిల్ యూవీ బ్యానర్ లో సినిమా చేయనున్నాడు. కానీ నాగ్ మాత్రమే ఇప్పటికీ ఏ సినిమాను అనౌన్స్ చేయకుండా ఫ్యాన్స్ ను సస్పెన్స్ లో ఉంచుతున్నాడు.













