అన్స్టాపబుల్ బన్నీ2 కోసం ఫ్యాన్స్ వెయిటింగ్
తెలుగు టాక్ షోలలో అన్స్టాపబుల్(Unstoppable) సృష్టించిన ట్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుని నాలుగో సీజన్ కు రెడీ అయిన ఈ షోకు రీసెంట్ గా గ్రాండ్ లాంచ్ జరిగింది. ఈసారి గెస్టులుగా ఎవరు రాబోతున్నారనే టోటల్ లిస్ట్ ఇంకా బయటకు రాలేదు కానీ దుల్కర్ సల్మాన్(Dulquer Salman), అల్లు అర్జున్(Allu Arjun) పేర్లయితే బయటికొచ్చేశాయి.
దీంతో ఇప్పుడు అందరి దృష్టి బన్నీ(bunny) ఎపిసోడ్ పైనే ఉంది. ఐకాన్ స్టార్(Icon Star) అ్లలు అర్జున్ ఇప్పటికే ఒకసారి ఈ షోకు వచ్చాడు. కానీ అప్పటి పరిస్థితులకు ఇప్పటి సిట్యుయేషన్స్ కు చాలా తేడా ఉంది. బన్నీ నుంచి వచ్చే సమాధానాల కోసం ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. వాటిలో పుష్ప2(Pushpa2) కంటే కీలకమైన విషయాలు మరికొన్ని ఉన్నాయి.
అందులో మొదటిది ఎలక్షన్స్ టైమ్ లో వైసీపీ అభ్యర్థి కోసం బన్నీ నంద్యాల వెళ్లడం. ఈ విషయంలో చాలా పెద్ద రచ్చే జరిగింది. సోషల్ మీడియాలో మెగా వర్సెస్ అల్లు(MegaVsAllu) అనే వార్స్ కూడా నడిచాయి. బన్నీ వాస్(Bunny Vaas), అల్లు అరవింద్(Allu Aravind) పలు సందర్భాల్లో దీని గురించి పరోక్షంగా క్లారిటీ ఇవ్వాలని చూసిన అవేమీ మెగా ఫ్యాన్స్ లోని ఫైర్ ను తగ్గించలేకపోయాయి. వాటికి బన్నీ ఆన్సర్ ఇస్తే తప్ప క్లారిటీ రాదు. మామూలుగా బన్నీ ఒకే షోకు ఇలా రెండుసార్లు వెళ్లడానికి ఆసక్తి చూపించడు. కానీ అన్నింటికీ చెక్ పెట్టాలనే ఉద్దేశంతో అల్లు అరవింద్ సలహా మేరకు బన్నీ ఈ షోకు మరోసారి వెళ్లినట్లు సమాచారం. మరి బన్నీ ఇప్పుడైనా అన్ని విషయాల్లో ఓపెన్ అయి క్లారిటీ ఇస్తాడా లేదా అన్నది చూడాలి.













