రాజా సాబ్ విషయంలో డార్లింగ్ ఫ్యాన్స్ అసంతృప్తి
వరుస సినిమాలతో ప్రభాస్ ఫుల్ బిజీగా ఉన్నాడు. గతేడాది డిసెంబర్ లో సలార్1 తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేసిన ప్రభాస్, వచ్చ నెలలో కల్కి గా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అయితే ఒక విషయంలో మాత్రం ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. సెట్స్ పైనున్న ప్రభాస్ సినిమాల్లో రాజా సాబ్ సినిమా విషయంలో ప్రభాస్ ఫ్యాన్స్ నిరుత్సాహంగా ఉన్నారు.
దానికి రీజన్ ఈ సినిమా మొదలై ఏడాది దాటుతున్నా సినిమా నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్ మినహా మరే అప్డేట్ రాకపోవడమే. ఈ సినిమా విషయంలో చిత్ర యూనిట్ ఎందుకో కానీ ముందు నుంచి సీక్రెసీ మెయింటెయిన్ చేస్తుంది. మొదట్లో మారుతితో ప్రభాస్ సినిమా చేయడమేంటని కోప్పడ్డప్పటికీ తర్వాత ఫస్ట్ లుక్ చూశాక డార్లింగ్ ఫ్యాన్స్ కాస్త శాటిస్ఫై అయ్యారు.
అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ తర్వాత రాజా సాబ్ కు సంబంధించిన ఎలాంటి అప్డేట్ బయటకు రాలేదు. అసలు సినిమా షూటింగ్ ఎక్కడ జరుగుతుంది? ఎంతవరకు వచ్చింది అనే విషయాలేవీ చెప్పడం లేదు. ప్రభాస్, కల్కి సినిమాపై దృష్టి పెట్టడంతో మిగిలిన వాటిని పూర్తిగా లైట్ తీసుకున్నాడు. రాజాసాబ్ నుంచి టీజర్ వస్తుందని అప్పట్లో అన్నారు కానీ దాని ఊసే లేదు. థ్రిల్లర్ మూవీగా వస్తున్న రాజా సాబ్ విషయంలో ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ ను మేకర్స్ డిలే చేయడం వల్ల ఆ బజ్ కూడా పోయే ఛాన్సుంది. ఇప్పటికైనా దాన్ని అర్థం చేసుకుని రాజా సాబ్ మేకర్స్ ఏదొక అప్డేట్స్ ఇస్తే బెటర్.













