ఆహా డౌన్ అవ్వడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు
ఆహా ఓటీటీ తెలుగు ప్రేక్షకులకు చేరువై మూడేళ్లవుతోంది. ఈ మూడేళ్లలో ఎప్పుడూ జరగనిది మొన్న గురువారం రాత్రి జరిగింది. ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆహా ట్రాఫిక్ పెరిగిపోయి సర్వర్ డౌన్ అయింది. దాదాపు కొన్ని గంటల పాటూ యాప్ లో అసలు కంటెంట్ కనిపించలేదు. దీనికంతటికీ కారణం పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, అతని ఫ్యాన్సే. నందమూరి బాలకృష్ణ ఆహా ఓటీటీ కోసం చేస్తున్న అన్‌స్టాపబుల్ రెండో సీజన్లో ఒక ఎపిసోడ్‌కు గెస్టుగా ఇండియన్ బిగ్గెస్ట్ స్టార్ ప్రభాస్ విచ్చేశాడు.
ప్రభాస్ సినిమాల్లో కనిపించినంత గంభీరంగా, సందడిగా బయట ఉండడు. రియల్ లైఫ్ లో ప్రభాస్ కు, రీల్ లైఫ్ లో ప్రభాస్‌కు చాలా తేడా ఉంది. ప్రభాస్ బయట మాట్లాడటం చాలా అరుదు. ఈవెంట్స్ లో కూడా చాలా తక్కువగా మాట్లాడతాడు. మీడియాకు పర్సనల్ గా ఇంటర్వ్యూలు ఇవ్వడు. అందరితో పోలిస్తే ప్రభాస్ గురించి జనాలకు తెలిసింది చాలా తక్కువ.
దీంతో అతని పర్సనల్ లైఫ్ గురించి తెలుసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఫ్యాన్స్‌కే కాదు, సగటు ప్రేక్షకుడికి కూడా కుతూహలంగా అనిపించింది. అయితే ఈ ఎపిసోడ్ చూశాక ఆహా సర్వర్ డౌన్ అవడంలో అసలు ఆశ్చర్యపోవాల్సిన పనిలేదనిపించింది. అసలు అన్‌స్టాపబుల్ లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ ఎపిసోడ్ అని చెప్పుకునేలా ఎపిసోడ్‌ను రన్ చేశారు ప్రభాస్, బాలయ్య. అంత ఇంట్రెస్టింగ్ గా, ఉత్సాహంగా సాగింది ఎపిసోడ్ మొత్తం.
ప్రభాస్ కు నార్మల్ గా యాంటీ ఫ్యాన్స్ చాలా తక్కువ. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే ప్రభాస్ ని అందరూ ఇష్టపడతారు. ప్రేమిస్తారు. ఎక్కడా హంగామా చేయకుండా ప్రభాస్ ని నిజంగానే అందరూ డార్లింగ్ అనుకుంటారు. ఇదంతా తెర మీద చూసే ప్రభాస్ కాదు, రియల్ లైఫ్ లో కూడా ప్రభాస్ ఇంతే ఉంటాడని క్లియర్ గా తెలిసిపోతుంది ఈ ఎపిసోడ్ చూస్తే. ఇంత పాజిటివిటీ ఉన్న హీరోలు, స్టార్ యాక్టర్లు చాలా అరుదుగా కనిపిస్తారు.













