తారక్ పై ప్రెషర్ పెంచుతున్న ఫాన్స్…
RRR తో వరల్డ్ ని షేక్ చేసిన హీరోల్లో ఎన్టీఆర్ ఒకరు. కొమరం భీం పాత్రలో తన విశ్వరూపాన్ని ప్రపంచానికి చూపించాడు ఎన్టీఆర్. ఇక ఈ సినిమాలో రాంచరణ్ , ఎన్టీఆర్ కలిసి చేసిన నాటు నాటు సాంగ్ ఎంత ఫేమస్ అయ్యిందో తెలిసిందే. ఈ పాటతో ఈ ఇద్దరు హీరోలు వరల్డ్ ఫేమస్ అయ్యారు.
ఇక ఈ సినిమా తర్వాత రాంచరణ్ వరుస సినిమాలతో బిజీ అయ్యాడు.ఆర్సీ 15 మూవీ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతుంది. అది పూర్తి కాకుండనే ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు తో సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. చరణ్ సినిమాల లైన్ అప్ తో మెగా ఫాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
ఎన్టీఆర్ విషయం లో మాత్రం సీన్ రివర్స్ అయిందనే చెప్పుకోవాలి. తర్వాత సినిమా గురించి క్లారిటీ లేకపోవడంతో నందమూరి ఫాన్స్ అప్ సెట్ అవుతున్నారు. ఎన్టీఆర్ 30 వ సినిమా అనౌన్స్ చేసి మూడు నెలలు అయినా కూడా ఇప్పటివరకు ఈ సినిమా మీద ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబో లో ఈ సినిమా రాబోతుంది అన్న విషయం తెలిసిందే.
ఆచార్య ప్లాప్ వల్ల కొరటాల బయట కనిపించడమే మానేశారు. తారక్ 30 వ సినిమాని పాన్ ఇండియా సినిమాగా అనౌన్స్ చేసారు , కానీ స్క్రిప్ట్ లో మార్పులవల్ల ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్ళడానికి టైం పడుతుందని సమాచారం. ఎన్టీఆర్ కూడా డైరెక్టర్ కి కావాల్సినంత టైం తీసుకోమని చెప్పారట. మిగిలిన హీరోలు వేగాన్ని పెంచగా, ఇప్పుడు తారక్ పై ఫాన్స్ ప్రెషర్ పెరిగింది .
కొరటాలతో సినిమా లేట్ అయ్యేట్టు ఉంటే, ఈ గ్యాప్ లో ఇంకో సినిమాకి ప్లాన్ చేయొచ్చుగా అని ఫాన్స్ డైరెక్ట్ గా ఎన్టీఆర్ ని టాగ్ చేసి కామెంట్స్ చేస్తున్నారు. తన 30 వ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అన్నది ఎన్టీఆర్ కి కూడా క్లారిటీ లేదని తెలుస్తుంది. ఎన్టీఆర్ మాత్రం కొరటాల సినిమాకి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
అసలు ఏ మాత్రం హడావిడి లేకుండా బెస్ట్ అవుట్ ఫుట్ కోసం ప్లాన్ చేస్తున్నారట. కొరటాల శివ తర్వాత ప్రశాంత్ నీల్ తో తారక్ తదుపరి సినిమాని చేయబోతున్నారు. ఈ సినిమా మొదలు పెడదామన్నా సాలార్ ఇంకా కంప్లీట్ అవ్వకపోవడంతో ఎన్టీఆర్ కూడా వెయిట్ చేస్తున్నారని సమాచారం. ఇక ఈ సినిమా ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తుందోనని నందమూరి ఫాన్స్ వెయిట్ చేస్తున్నారు.













