అవసరాల సినిమాపై ఫ్యాన్స్ అసహనం
అవసరాల శ్రీనివాస్. విభిన్న నటుడిగా ఎంతో పేరు తెచ్చుకున్న అవసరాల, దర్శకుడిగా మారి అంతకుమించిన క్రేజ్‌ను దక్చించుకున్నాడు. అవసరాల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ఊహలు గుసగుగసలాడే కమర్షియల్ సక్సెస్ కావడమే కాకుండా సినిమా మంచి విజయం సాధించి, కల్ట్ క్లాసిక్ గా నిలిచింది.
తర్వాత రెండో సినిమా జ్యో అచ్యుతానంద కూడా కమర్షియల్ గానూ, కంటెంట్ పరంగానూ హిట్టయింది. దీంతో అవసరాల నుంచి మూడో సినిమా ఎప్పుడొస్తుందా అని ఫ్యాన్సంతా తెగ వెయిట్ చేశారు. కానీ ఈ సారి అవసరాల చాలా లాంగ్ గ్యాప్ తీసుకున్నాడు. స్క్రిప్ట్ రాసి సినిమాను స్టార్ట్ చేయడమే లేట్ అయితే, దాని తర్వాత కరోనా, ఇతరత్రా కారణాల వల్ల ఆ గ్యాప్ ఇంకా పెరగుతూ వచ్చింది.
కానీ మూడో సినిమా పాటలు రిలీజయ్యాక లేటయితే అయింది అవసరాల మరో క్లాసక్తో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడనుకున్నారంతా. కానీ మూవీ చూశాక అందరి ఆశలపై నీళ్లు చల్లాడు. స్టోరీ, క్యారెక్టర్స్, సీన్స్ సహజంగా ఉంటూ హాలీవుడ్ సినిమా బిఫోర్ సన్‌రైజ్ మాదిరి సినిమా తీయాలని ట్రై చేసిన అవసరాల ప్రయోగం భారీగా బెడిసికొట్టింది.
దీంతో సినిమా మొదలైన కాసేపటికే ఆడియన్స్ లో నిరాశ మొదలై, క్లైమాక్స్ వరకు కూర్చోవాలా అని భారం మొదలైంది. అసలు కనీసం సినిమా షూటింగ్ అయ్యాక రషెస్ కూడా చూడలేదా అనే అనుమానం వచ్చే పరిస్థితి. ఇలాంటి సినిమా కోసమా అవసరాల ఏడేళ్లు టైమ్ గ్యాప్ తీసుకున్నాడు అంటూ అందరూ అవసరాల పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.













