పుష్ప2 టీజర్ పై ఫ్యాన్స్ అసంతృప్తి
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్నా హీరోహీరోయిన్లుగా తెరకెక్కుతున్న సినిమా పుష్ప2. బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్ అయిన పుష్ప సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కుతుంది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను బన్నీ బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేశారు.
రిలీజ్ చేసిన 13 గంటల్లోనే 51మిలియన్లకు పైగా వ్యూస్ తో, 1 మిలియన్ కు పైగా లైక్స్ తో పుష్ప2 టీజర్ నెట్టింట ట్రెండ్ అవుతోంది. ఇదిలా ఉంటే ఓ వర్గం ఫ్యాన్స్ మాత్రం ఈ టీజర్ పై అసంతృప్తిగా ఉన్నారు. కేవలం 1.06 నిమిషాల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో కీలకమైన జాతర సీన్ ను చూపించారు. ఇప్పటికే పుష్ప2 ఫస్ట్ లుక్ లో కూడా ఇదే పోస్టర్ ను రివీల్ చేశారు.
ఇప్పుడు టీజర్ లో మరోసారి బన్నీని వీడియో రూపంలో ప్రెజెంట్ చేస్తూ దానికి యాక్షన్ సీన్స్ ను యాడ్ చేశారు. గంగమ్మ జాతరలో అమ్మవారి గెటప్ లో బన్నీ అదరగొట్టాడు. టీజర్ లాస్ట్ లో రౌడీలను చితక్కొడుతూ చీర కొంగును కాలితో చేతికి తీసుకుని నడుమున దోపే షాట్ కు అందరూ ఫిదా అయిపోయారు. కానీ టీజర్ లో ఒక్క డైలాగ్ కూడా లేకపోవడం బన్నీ ఫ్యాన్స్ ను నిరాశ పరుస్తుంది. ఇలాంటి టీజర్ లో ఒక్క డైలాగ్ పడుంటే టీజర్ నెక్ట్స్ లెవెల్ లో ఉండేదని ఫ్యాన్స్ అంటున్నారు. రిలీజ్ ఒత్తిడిలో ఉన్న సుకుమార్ డైలాగ్ ను కూడా కట్ చేయాలంటే వివిధ భాషల్లో నాలుగైదు టీజర్లు రెడీ చేయాలి. అందుకనే డైలాగ్ లేకుండా టీజర్ ను కట్ చేసి ఉంటారని కొందరంటున్నారు.













