ఖైదీ2 కోసం ఫ్యాన్స్ డిమాండ్
లోకేష్ కనగరాజ్ డైరెక్టర్ గా తీసిన లియో సినిమా అనుకున్న అంచనాలను పూర్తిగా అందుకోలేకపోయినా, కలెక్షన్స్ మాత్రం బాగా వస్తున్నాయి. ఈ సినిమా లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ లో భాగమా కాదా అన్నది తెలుసుకోవాలనే ఆసక్తితోఅడ్వాన్స్ బుకింగ్స్ కూడా చాలా భారీగా వచ్చాయి. ఈ సినిమాకు కలెక్షన్స్ కేవలం తమిళంలోనే కాదు, తెలుగులో కూడా లియోకు మంచి కలెక్షన్స్ వస్తున్నాయి.
ఈ సినిమాను లోకేష్ నడిపించిన తీరు పట్ల విజయ్ ఫ్యాన్స్ శాటిస్ఫైయింగ్గా లేడు. దీంతో లోకేష్, రజనీకాంత్ ను ఎలా హ్యాండిల్ చేస్తాడని తలైవా ఫ్యాన్స్ కంగారు పడుతుంటే, మరోవైపు ఈ సినిమా కంటే ముందుగా ఖైదీ2 సినిమా చేయాలని కొంతమంది అడుగుతున్నారు. ఒక్క రాత్రిలో జరిగే సీన్స్ తో క్రైమ్ థ్రిల్లర్ ను లోకేష్ తెరకెక్కించిన విధానం ఇప్పట్లో ప్రేక్షకులు మర్చిపోలేరు.
దానికి తోడు కార్తీ నటన, పోలీసులను కాపాడే ముందు బిర్యానీ తినే సీన్, క్లైమాక్స్‌లో రౌడీ గ్యాంగ్ పోలీస్ స్టేషన్ చుట్టుముట్టినప్పుడు వచ్చే ఫైట్.. వీటిలో దేన్నీ ఆడియన్స్ మర్చిపోలేదు. ఢిల్లీ అసలు జైలు కు ఎందుకు వెళ్లాడనేది ఖైదీ2లో చూపిస్తానని లోకేష్ ఇప్పటికే పలుసార్లు చెప్పుకొచ్చాడు. ఎంత ఫ్యాన్స్ కోరుకున్నా సరే లోకేష్ మాత్రం ఇప్పటికే రజనీతో సినిమాను అనౌన్స్ చేశాడు కాబట్టి ఖైదీ రావడానికి ఎంతలేదన్నా 2025 వరకు టైమ్ పడుతుంది.













