‘ఆదిపురుష్’ ఫ్యాన్ మేడ్ పోస్టర్ కి ఫిదా.. ప్రభాస్ లుక్ చూసి ఆలోచనలో పడ్డ ఓం రౌత్!
ఇప్పుడు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ ఉందా అంటే అది ప్రభాసే. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరో సాధించని ఘనత సాధించాడు ప్రభాస్. బాహుబలి వంటి భారీ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానుల్ని సంపాదించుకున్న ప్రభాస్ ఏయే సినిమాలు చేయబోతున్నాడు? ఏ సినిమా ఎలా ఉండబోతోంది? ఆ సినిమాల్లో ప్రభాస్ క్యారెక్టర్ ఎలా ఉండబోతోంది? గెటప్ ఎలా ఉండబోతోంది? వంటి విషయాల గురించి సోషల్ మీడియాలో విపరీతంగా చర్చలు జరుగుతున్నాయి. కొంతమంది అభిమానులు కాస్త ముందుకెళ్ళి తమ అభిమాన హీరో గెటప్ ఈ సినిమాలో ఇలా ఉండబోతోంది, ఆ సినిమాలో అలా ఉండబోతోంది అంటూ క్రియేట్ చేసి మరీ పోస్ట్ చేస్తున్నారు. అలాంటి ఓ ఫ్యాన్ మేడ్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ప్రస్తుతం ప్రభాస్ `రాధేశ్యామ్` సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్‌లుక్‌తోపాటు టీజర్ కూడా విడుదలై సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమా తర్వాత నాగ్ అశ్విన్ కాంబినేషన్లో సి.అశ్వినీదత్ నిర్మించే సినిమాలో నటించబోతున్నాడు. అలాగే ఓం రౌత్ దర్శకత్వంలో `ఆదిపురుష్` అనే సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈ సినిమాలో ప్రభాస్.. రాముడుగా కనిపిస్తాడని, రావణుడిగా సైఫ్ అలీ ఖాన్ నటించనున్నాడని చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే రాముడిగా ప్రభాస్ గెటప్ ఎలా ఉండబోతుందనే క్యూరియాసిటీ అభిమానుల్లో ఎక్కవైపోయింది. అందుకే ఎవరికి తోచిన విధంగా వారు ఊహించుకుంటూ తమ అభిమాన హీరో గెటప్‌ని క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.
తాజాగా ఓ అభిమాని `ఆదిపురుష్` సినిమాలో ప్రభాస్ ఇలా ఉండబోతున్నాడంటూ ఓ పోస్టర్‌ను పోస్ట్ చేశాడు. నిజానికి ఆ గెటప్‌లో ప్రభాస్ అద్భుతంగా ఉన్నాడు. ఆ సినిమాలో నిజంగా ప్రభాస్ ఇలాగే ఉంటాడని చాలా మంది కాన్ఫిడెంట్‌గా చెబుతున్నారు కూడా. ఈ పోస్టర్‌ను చూసిన డైరెక్టర్ ఓంరౌత్ కూడా షాక్ అయ్యాడట. అంతేకాదు, ఆ పోస్టర్‌కి ఫిదా అయ్యాడు. తను చేయబోయే సినిమాలో ప్రభాస్ లుక్ ఇంత భారీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారన్న విషయాన్ని గ్రహించాడు. అయితే తన ఊహల్లో ప్రభాస్ ఎలా ఉన్నాడో ఎవ్వరికీ తెలీదు. అంచనాలు మాత్రం తారాస్థాయిలో ఉన్నాయి. మరి ఆ అంచనాలను ఓం రౌత్ ఎంతవరకు రీచ్ అవుతాడు అనేది ఈ సినిమాలోని ప్రభాస్ లుక్ విడుదలైతే తప్ప చెప్పలేం.













