టాలీవుడ్ లో మరో విషాదం ప్రముఖ రచయిత వెన్నెలకంటి గుండెపోటుతో మృతి
ప్రముఖ తెలుగు సినీరచయిత వెన్నెలకంటి (వెన్నెలకంటి రాజేశ్వర ప్రసాద్) కన్నుమూశారు. ఈయన ఇంటి పేరు వెన్నెలకంటి. ఎన్నో సూపర్‌హిట్ పాటలు ఆయన కలం నుంచి జాలువారాయి. డబ్బింగ్ చిత్రాలకు మాటలు, పాటలు అందించారాయన. దాదాపు 2వేల పాటల వరకు రాశారాయన. `మహర్షి`లోని పాటలు ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చాయి. ఆయన రాసిన పాటలోని పంక్తి `చిరునవ్వుల వరమిస్తావా చితి నుంచి లేచొస్తా.. మరుజన్మకు కరుణిస్తావా… ఈ క్షణమే మరణిస్తా“ చాలా పాపులర్ అయ్యింది. ముఖ్యంగా కమల్ హాసన్‌కి ప్రీతిపాత్రుడు. ఆయన సినిమాలు తెలుగులో డబ్బింగ్ అయితే… మాటలు – పాటలు రాసే బాధ్యత వెన్నెల కంటిదే. కుమారులు శశాంక్ వెన్నెలకంటి, రాకేందు మౌళి కూడా గీత రచయితలుగా స్థిరపడుతున్నారు. ఆయన హరికథలు, అత్యాద్మిక ప్రసంగాలు వినడం అంటే చాలా ఇష్టపడేవారు. కాలేజి రోజుల్లో “రసవినోదిని” రేడియో ప్రసంగాలు వినేవారు. 11 ఏళ్లకే కవితలు, పద్యాలూ రాశారు.
1975లో విజయవాడ రేడియో కేంద్రం కవితల పోటీలలో 9 కవితలు సెలెక్టు అయ్యాయి. జంద్యాల రాసిన ఏక్ దిన్కా సుల్తాన్, ఈ చరిత్ర ఏ సిరాతో, ఎవ్వనిచే జనించు, దర్పణం వంటి నాటకాలలో నటించారు. డా. ప్రభాకర్ రెడ్డి ప్రోద్బలముతో శ్రీరామచంద్రుడు సినిమాలో చిన్ని చిన్ని కన్నయ్యకు వెన్నెల జోల అనే పాట రాశారు పాట వ్రాసారు. అదే గీత రచయితగా తొలి పరిచయం. అటు తరువాత అన్నా చెల్లెలులో పాటలు వ్రాసారు. నాయకుడు సినిమాతో అనువాదంలో ప్రవేశించారు. ప్రేమాగ్ని సినిమాకు తెలుగులో మాటలు వ్రాసారు.













