సూపర్ ఛాన్స్ కొట్టేసిన ఫ్యామిలీ స్టార్
ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్లో తెరకెక్కుతున్న దేవర సినిమా అందరూ అనుకున్నట్టే వాయిదా పడింది. ఇంకా టీమ్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు కానీ ఇతర నిర్మాతల నిర్ణయాలు చూస్తుంటే దేవర పోస్ట్ పోన్ కన్ఫర్మ్ అని తెలుస్తోంది. దేవర డేట్ ను మిస్ చేసుకోకూడదనే ఆలోచనతో అందరికంటే ముందే దిల్ రాజు ఆ డేట్ను ఫ్యామిలీ స్టార్ మూవీ కోసం లాక్ చేసుకున్నాడు.
ఏప్రిల్ 5కు ముందు వారం నాగవంశీ, టిల్లూ స్వ్కేర్ ను రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశాడు. దీంతో దేవర వాయిదా ఫ్యామిలీ స్టార్ కు బాగా కలిసొచ్చింది. దేవర సినిమాను అనుకున్న టైమ్ కు తీసుకురావాలని ఎంతో ప్లానింగ్ తో ఉన్నప్పటికీ కొన్ని కారణాల వల్ల సినిమా రిలీజ్ డే టార్గెట్ ను అందుకోలేకపోతుంది.
అందులో మొదటి కారణం అనిరుధ్. ఆయన్ను తొందరపెడితే అతన్నుంచి బెస్ట్ అవుట్పుట్ ను రాబట్టుకోలేం. దీంతో ఓపికతో ఎదురుచూడటం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. మరోటి సైఫ్ అలీ ఖాన్ కు సర్జరీ జరిగి షూటింగ్ లేటవ్వడం. అన్నింటికంటే ముఖ్యమైనది సినిమా వీఎఫ్ఎక్స్ వర్క్స్. లేటయినా కంటెంట్ లో రాజీ పడకూడదనే ఉద్దేశంతో దేవర రిలీజ్ డేట్ ను లైట్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పుడది విజయ్ దేవరకొండకు ప్లస్ అయింది. ఫ్యామిలీ స్టార్ సినిమాకు మంచి రిలీజ్ డేట్ దొరికింది. లాంగ్ వీకెండ్ తో పాటూ ఉగాది పండగ కూడా ఉండటంతో సినిమాకు మంచి టాక్ వస్తే కలెక్షన్స్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయం.













